Bore Well: బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి.. కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..
రెండేళ్ల చిన్నారి బోరు బావిలో పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. సెహోర్ జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం చిన్నారి ఆడుకుంటూ 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దించారు. మొదటగా 20 అడుగుల వద్ద చిన్నారి చిక్కుకోగా.. తర్వాత 50 అడుగుల వరకు జారుకుంది.
దాదాపు 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జేసీబీతో బోరు బావికి సమాంతరంగా గోతి తవ్వుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మధ్య రాతి నేల కారణంగా సమయం తీసుకుంటోందని సెహోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ తివారీ తెలిపారు. "చిన్నారు 50 అడుగులకు పైగా జారిపోయింది. మేము నేలను తవ్వేకొద్దీ బాలిక కిందికి జారుతోంది. ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నాము. గట్టి రాయి కారణంగా డ్రిల్లింగ్ చేయడంలో మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మేము ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము. త్వరలో ఆమెను బయటకు తీస్తాం" అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అధికారులు నిరంతరం పని చేస్తున్నారని, వారు భూమి నుండి 26-27 అడుగుల వరకు చేరుకోగలిగారని ఆయన అన్నారు."మేము నిరంతరం పని చేస్తున్నాము. మేము సుమారు 26-27 అడుగులకు చేరుకోగలిగాము. NDRF బృందం మరొక సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తోంది, వారు ప్రయత్నిస్తున్నారు, వారు హార్డ్ రాక్ కారణంగా సమయం తీసుకుంటున్నారు" అని తివారీ చెప్పారు.
ముంగోలి గ్రామంలోని పొలంలో ఆడుకుంటూ బాలిక బోరుబావిలో పడిపోయింది.
బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం ఆమెను బోర్‌వెల్ నుండి తరలించే ప్రక్రియను ప్రారంభించిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతోన్నాయి. మరి కొద్ది గంటల్లో పాపను బయటకు తీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications