వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: బాలుడి పాటకు పోలీసులు ఫిదా .. వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

పోలీసులంటే చాలా మందికి భయం ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటే వారు భయపడుతుంటారు. అయితే పోలీసులు కూడా మనుషులే.. వారికి మనస్సు ఉంటుంది. వారు మనలాగే ప్రతిభ వంతుల్ని ప్రోత్సాహిస్తారు. తాజాగా కేరళ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కుర్చీని డప్పుగా..

కుర్చీని డప్పుగా..


వైరల్ అవుతున్న వీడియోలో బాలుడు మలయాళ జానపద పాటను ఉత్సాహంగా పాడుతున్నట్లు చూడవచ్చు. అతను ప్రారంభించడానికి ముందు ఒక పోలీసు అధికారి పక్కన కూర్చున్నాడు. బాలుడు పాడుతున్నప్పుడు, ఒక మహిళా పోలీసు అధికారి అతని ముందు మరొక కుర్చీని ఉంచారు. తద్వారా అతను దానిని కొట్టి మెలోడీని సృష్టించాడు.

జాకీర్ భాయ్..

జాకీర్ భాయ్..


బాలుడు హృదయపూర్వక వినోదాన్ని అందించడంతో నట్టుకల్ పోలీస్ స్టేషన్ మొత్తం బాలుడిని అభినందించింది. "జాకీర్ భాయ్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి పాట పాడగలరా? పాలక్కాడ్ నట్టుకల్ పోలీస్ స్టేషన్‌లో చూశాను" అని మలయాళంలో పోస్ట్ క్యాప్షన్ కూడా పెట్టారు. క్లిప్‌లోని టెక్స్ట్ ప్రకారం, అబ్బాయి పేరు యాదవ్.

4 లక్షలకు పైగా వ్యూస్..

4 లక్షలకు పైగా వ్యూస్..


ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేసినప్పటి నుంచి 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు బాలుడి పాటకు ఎంజాయ్ చేశారు. బాలుడు చాలా బాగా పాడుతున్నాడని కామెంట్ చేశారు.

English summary
While police stations can be scary and intimidating, it was not the case with this young boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X