Viral Video: విమానంలో చిన్నారి బర్త్ డే వేడుకలు.. వైరల్ అవుతోన్న వీడియో..

పుట్టిన రోజు ఇది ఎవరి జీవితంలోనైనా గొప్ప రోజు. అందుకే బర్త్ డే రోజు కొందరు సెలబ్రెట్ చేసుకుంటారు. పార్టీలు ఇస్తుంటారు. మరికొందరు పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేస్తుంటారు. మరి కొందరమో తమ బర్త్ డే వినూత్నంగా జరుపుకుంటారు. కానీ కొంత మంది బర్త్ డే అనుకోకుండా గొప్పగా జరుగుతుంది. అలానే ఓ చిన్నారి బర్త్ డే వినూత్నంగా జరిగింది. ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు గాల్లో ఉండగా.. జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే పాప బర్త్ డే ఇలా జరుగుతుందని చిన్నారి కుటుంబ సభ్యులు ఊహించలేదు. పాప బర్త్ డే సంబంధించిన వీడియోను తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురు బర్త్ డే ఇంత ఘనంగా జరిపినందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గాల్లో ఎగురుతున్న ఇండిగో విమానంలో సిబ్బంది ఓ పాప బర్త్ డే ఘనంగా నిర్వహించారు. వీడియోలో కెప్టెన్ పాపను ఎత్తుకుని సీట్ల మధ్యలోకి వచ్చాడు. అతను " లేడీస్ అండ్ జెంటిల్‌మన్.. నా పేరు అగస్టిన్.. అది ముఖ్యం కాదు, ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఈ చిన్నారి మొదటి పుట్టినరోజు" అని చెప్పాడు.

A video of a childs birthday celebration on board the Indigo Airlines flight is going viral on social media

"ఈ చిన్నారి ఈ రోజుతో తన జీవితంలో మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. కేక్ కట్ చేసి ఇప్పుడు అందరికీ పంచిపెడుతుంది. మీరంతా ఈ పాపను ఆశీర్వదించండి" అని కూడా అనౌన్స్ చేశాడు. దీంతో విమానంలో ఉన్న వారు పాపకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటన జూన్ 22న జరిగింది. "మా యువరాణికి 22 జూన్ 2023న సంవత్సరం నిండింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ దీన్ని ప్రత్యేకంగా రూపొందించినందుకు చాలా కృతజ్ఞతలు " అని పాప తండ్రి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. "ఆజ్ ఏక్ సాల్ కీ హో గయీ హై దుర్గానాథ్, సో కేక్ భీ కటేగా, సబ్ మే బటేగా. ఆప్కీ ఆగే కి యాత్ర మంగళమే హో లేదా బచే కో ఆశీర్వాద దే. మీ ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నాను" ఓ నెటిజన్ కామెంట్ కూడా చేశఆడు.

"సో క్యూట్ అండ్ స్వీట్ ఇండిగో ఎయిర్‌లైన్స్, పుట్టినరోజు శుభాకాంక్షలు లిటిల్ ప్రిన్సెస్" అని మరొక వినియోగదారు రాశారు. "ఫ్లైట్‌లో ప్రత్యక్షంగా ఉన్న ఈ పాప వీడియోను చూసే అవకాశం నాకు లభించింది. కానీ మీరు వీడియోను అద్భుతంగా రూపొందించారు. తల్లిదండ్రులు మీ బిడ్డకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ సురక్షితమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. సురక్షితమైన జీవితం ఉండాలని కోరుకుంటారు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు కామెంట్ చేశారు.

"సూపర్ క్యూట్! పుట్టినరోజు శుభాకాంక్షలు!," మరొక వినియోగదారు రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 10లక్షల వ్యూస్ రాగా.. చాలా మంది ఇండిగో ఎయిర్ లైన్స్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+