Viral Video: ఇదేం పనిరా నాయనా.. మెట్రోలో రెచ్చిపోయిన జంట.. వైరలవుతున్న వీడియో..
అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు మెట్ర రైళ్లలో చిల్లర పనులు మానడం లేదు. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, పట్టుకోవడం వంటి ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలు నివారించడానికి DMRC మెట్రో లోపల ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఉంచినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వైరలవుతున్న వీడియో ఢిల్లీ మెట్రో రైల్లో ఓ జంట ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం కనిపిస్తోంది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఢిల్లీ మెట్రో పేరును P0rnHubగా ఎందుకు మార్చకూడదు అంటూ యూజర్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు ఇదే ఢిల్లీ మెట్రో రైలులో యవ్వనంలో ఉన్న ఓ జంట నిలబడి ఒకరిని ఒకరు వాటేసుకున్నారు. తాము మెట్రో రైలులో ఉన్నామని, రైలు సిటీలో ప్రయాణిస్తున్నదని, ఇదే రైలులో సాటి ప్రయాణికులు ఉన్నారని ఆ జంట ఏమాత్రం పట్టించుకోలేదు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడి వాటేసుకుని మౌత్ కిస్ పెట్టుకుంటూ వెళ్లారు.

మెట్రో రైలు ముందుకు వెలుతుంటే విరహంతో ఉన్న ఆ జంట వాళ్లపని వాళ్లు చేసుకుంటూ వెళ్లారు. ఇదే సమయంలో మెట్రో రైలులో ఉన్న తోటి ప్రయాణికులు జంట రొమాన్స్ సీన్ ను వీడియోలు తీశారు. ఆ తర్వాత ఏముంటుంది.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Why don't you change the name of Delhi Metro to P0rnHub.
— Avnendra Singh (@avnendra_s) May 10, 2023
"OMG WHAT" is this ?? #Delhimetro #viralvideo pic.twitter.com/hiRiAzGyjR
బ్రెజిల్ లో కూడా మెట్రోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కళ్లకు చలువ గ్లాసులు వేసుకుని, టీ షర్టు ధరించి మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించాడు. అప్పుడే ఓ ట్రైన్ రావడంతో దాన్ని ఆపుతున్నట్లు మనోడు బిల్డప్ ఇచ్చాడు. అది ఆగిన తర్వాత టీ షర్టు విప్పేసి కొద్దిసేపు ప్లాట్‌ఫారమ్‌పై కసరత్తు చేశాడు. అనంతరం రైలు కదలనుందనగా.. అతను రైలును తోసినట్లు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications