Viral Video: నడిరోడ్డుపై రోమాన్స్.. అవాక్కైన వాహనదారులు.. వీడియో వైరల్..
ఈ మధ్య కొంత మంది వైరల్ కావాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా లక్నోలోని రద్దీగా ఉండే హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఒక జంట కదులుతున్న ద్విచక్ర వాహనంపై రోమాన్స్ చేశారు. ఈ జంట రోమాన్స్ ను మిగతా వారు తమ సెల్ ఫోన్లలో బంధించారు. అనంతర ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ పోలీసులు స్పందించారు. ఆ జంట గాలింపు చేపట్టినట్లు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై లక్నో సెంట్రల్ జోన్ డీసీపీ అపర్ణ రజత్ కౌశిక్ మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో లక్నోకు చెందినదని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో తీసినదని ధృవీకరించారు.

ఆ జంట కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఈ జంటను పట్టుకునేందుకు పోలీసులు సమీపంలోని కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వారిపై మోటారు వాహనాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
नबाबों का शहर Lucknow उत्तर प्रदेश pic.twitter.com/dZ92Sn1R0E
— sakshi (@ShadowSakshi) January 17, 2023
"జంట ప్రవర్తన మర్యాద, సామాజిక ప్రవర్తన సరిహద్దులను అధిగమించడమే కాకుండా మోటారు వాహనాల చట్టం ప్రకారం కూడా నేరం" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications