Viral Video: పీత కూడా సిగరెటు తాగుతుందా.. వైరల్ అయిన వీడియో..
సోషల్ మీడియా వచ్చిన నుంచి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. తాజా ఒక పీతకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పీత చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ పీత ఏం చేసిందంటే..
ఈ వీడియోలో పీత సిగరెట్ తాగుతోంది. ఎవరో తాగిపడేసిన సిగరెట్ ను మనిషిలాగా దాని కోండ్లతో పట్టుకుని సిగరేటు తాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో 16 గంటల క్రితం పోస్టు చేయగా.. 38 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేలకు పైగా లైక్స్ రాగా 644 మంది రీట్వీట్ చేశారు.

ఫిగెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయడమే కాకుండా లిటిల్ డ్యూడ్ బీర్ మరిచిపోయిందని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ఇంట్రెస్టింగ్ గా స్పందిచారు. ఒకరు ధూమపానం ఆరోగ్యానికి హానికరమని కామెంట్ చేయగా.. పీత కూడా సిగరేట్ కు బానిస అయిపోయిందని మరొకరు కామెంట్ చేశారు.
The little dude forgot his beer. pic.twitter.com/kuhh2a0PVx
— Figen (@_TheFigen) September 7, 2022












Click it and Unblock the Notifications