Viral Video: బ్యాంక్ ఉద్యోగిపై ఖాతాదారుడి దాడి.. వైరల్ అయిన వీడియో..
ఖాతాదారుడు బ్యాంక్ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ఢిల్లీలో జరిగింది.
బ్యాంక్ ఉద్యోగిపై ఇద్దరు ఖాతాదారులు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని నదియాడ్-కపద్వాంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఫిబ్రవరి 03న బ్యాంక్ లోన్ విషయంలో ఇద్దరు కస్టమర్లు ఒక ఉద్యోగిపై దాడి చేశారు. ఈ దారుణం బ్యాంకులో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నదియాడ్-కపద్వాంజ్ బ్రాంచ్‌లో అధికారిగా పనిచేస్తున్న మనీష్ ధన్‌గర్, లోన్ డెస్క్‌లో ఉన్నప్పుడు ఖాతాదారులు కొట్టినట్లు బ్యాంక్ అధికారి తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగిపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధంగర్ తన ఫిర్యాదులో, "శుక్రవారం మధ్యాహ్నం, సమర్థ్ బ్రహ్మభట్ అనే కస్టమర్ బ్రాంచ్‌కు చేరుకుని నన్ను కొట్టాడు. అతను నన్ను మూడు నాలుగు సార్లు చెప్పుతో కొట్టాడు. తన్నాడు. ఇతర సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సమర్థ్ స్నేహితుడు పార్థ్, అతనితో పాటు వచ్చిన వారు నన్ను తన్నాడు" అని పేర్కొన్నాడు.

తన హౌస్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీని సమర్పించమని అతనికి పదేపదే కాల్స్ చేయడంతో సమర్థ్ తనపై, బ్యాంక్‌పై కోపంగా ఉన్నాడన ధంగర్ చెప్పాడు. సమర్థ్ బ్యాంకు నుంచి ఇంటి రుణం తీసుకున్నాడు. ఆడిట్ సమయంలో, కస్టమర్ తన హౌస్ ఇన్సూరెన్స్ పాలసీని సమర్పించలేదు. దీంతో పాలసీని సమర్పించాలని ధంగర్ కోరాడు. ఈ క్రమంలో ధంగర్ పై సమర్థ్ చేయి చేసుకున్నాడు.
#WATCH | An employee of the Bank of India, Nadiad branch was thrashed by a customer over the issue of a bank loan on 3rd February. Case registered under SC-ST (Prevention of Atrocities Act) in Nadiad Town Police Station#Gujarat pic.twitter.com/JJbMzA2cOO
— ANI (@ANI) February 5, 2023
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications