Viral Video: డెలివరీ బాయ్‍పై పెంపుడు కుక్క దాడి.. వీడియో వైరల్..
ఈ మధ్య పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోయాయి. మొన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో లిఫ్ట్‌లో ఓ బాలుడిపై పెంపుడు కుక్క కరిచింది. ఈ ఘటనలో మహిళ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మరవక ముందే జోమాటో బాయ్ పై పెంపుడు కుక్క దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లిఫ్ట్ బయట
ఈ వీడియోలో జోమాటో డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేసి లిఫ్ట్ లో కిందికి దిగాడు. అతడు కిందికి దిగి లిఫ్ట్ నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న పెంపుడు అతడి పై దాడి చేసింది. ఇందంతా లిఫ్ట్ లో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను డెంజర్ జోన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు.

లిఫ్ట్ లో
మెున్న జరిగిన ఘటనలో లిఫ్ట్ లో ఓ మహిళ తమ పెంపుడు కుక్క ఉంది. అదే లిఫ్ట్ లో బాలుడు స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. బాలుడి లిఫ్ట్ నుంచి బయట వెళ్తుండగా బాబును కుక్క కరిచింది. అయితే ఆ బాలుడి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications