Viral Video: జీవితం అంటే చావుతో పోరాటమేనా.. వైరల్ అవుతున్న వీడియో..
జీవితం అంటే నిత్యం పోరాటం అంటారు. ఈ మాట అక్షరాల సత్యం. చాలా మంది జీవించడం కోసం పోరాడుతుంటారు. కొందరైతే ప్రమాదమని తెలిసినా బతకడం ప్రాణాలను పనంగా పెడతారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి 4 అంతస్థుల పైన సెంట్రింగ్ వర్కు చేస్తున్నాడు. కానీ అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు.

పరిశుద్ధ్య కార్మికులు
ఒక వేళ అతను కింద పడితే ప్రాణాలు పోవడం ఖాయమే.. అయినా అతను బతకడం కోసం పని చేస్తున్నాడు. ఈ మధ్య విట్నెస్ అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో పరిశుద్ధ్య కార్మికులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి దిగి పని చేస్తుంటారు. ఇలా చేసేటప్పుడు కార్మికుల ప్రాణాలు పోతాయి. ఈ సందర్భంలో చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అంత సాహసం చేసే బదులు వెరే పని చేసుకోవచ్చు కదా... కానీ వారికి తెలిసిన పని అదొక్కటే కాబట్టి..

గీత కార్మికులు
అలాగే చాలా మంది గీత కార్మికులు తాడి చెట్ల పై నుంచి కింద పడి చనిపోతుంటారు. కానీ వారు తాడి చెట్లను ఎక్కడం ఆపారు. ఎందుకంటే వారి జీవన ఆధారమే అది కాబట్టి. ఆకాశాన్ని తాకే చెట్లు ఎక్కే గీత కార్మికులు సంపాదించేది మాత్రం అంతంతే. వీరే కాదు ప్రమాదమని తెలిసినా బతకడం కోసం ప్రాణాలు పనంగా పెడుతున్న వారు ఎందరో ఉన్నారు.
సౌకర్యాలు
ఇలా ప్రాణాలను పనంగా పెట్టి జీవించే వారికి ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ ఉంది. ఇలా పని చేసే వారికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రాణాలు పోయే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సెట్రింగ్ పని చేసే వ్యక్తి తాడు లాటింది కట్టుకుని పని చేయాలి.. లేకుంటే క్రేన్ ద్వారా వచ్చి పని చేయాలి అప్పుడే అతడి ప్రాణాలకు గ్యారెంటీ ఉంటుంది.












Click it and Unblock the Notifications