Viral Video: రూ.3100 కోసం నగ్నంగా ఊరేగించాడు.. వైరల్ అవుతోన్న వీడియో..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. పండ్ల మార్కెట్ లో అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని వ్యాపారి బట్టలు విప్పించి ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.3 వేల కోసం ఇంత దారుణానికి పాల్పడ్డాడు. రుణదాత అయిన సుందర్ అనే వ్యక్తిని అమిత్ అనే వ్యాపారిని బలవంతంగా బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టాడు.
ఈ సంఘటనను సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కనిపించిన సంఘటన నోయిడా ఫేజ్ 2 మార్కెట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అమిత్ అనే వ్యక్తి సుందర్ వద్ద నెల క్రితం రూ.5వేల 600 అప్పుగా తీసుకున్నాడు. సెప్టెంబర్ 19న అమిత్.. అప్పులోని రూ.2వేల 500ను తిరిగి చెల్లించాడు. మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. సుందర్ మాత్రం దానికి అంగీకరించలేదు.

డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కోపతం అమిత బట్టలు విప్పేశాడు. అతడిని ఊరేగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, అధికారులు స్పందించారు. సిటీ మేజిస్ట్రేట్ సుందర్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేశారు. అతనిపై ఫేజ్ 2 పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు చేశారు. సుందర్ ఫేజ్ 2లో చాలా కాలంగా పండ్ల దుకాణం నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు.
ఈ ఘటన గురించి తెలియగానే అతని దుకాణం లైసెన్స్ రద్దు చేసినట్లు సిటీ మేజిస్ట్రేట్ ధర్మంద్ర కుమార్ తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోను ప్రియా సింగ్ అనే మహిళ తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. " నోయిడాలో దారుణం తారాస్థాయికి చేరింది
వెల్లుల్లి అమ్మే యువకుడు రూ.5100 అప్పు తీసుకున్నాడు. రూ.3100 మిగిలాయి. ఇదే విషయంపై రుణదాత ఆ యువకుడిని వివస్త్రను చేసి మార్కెట్‌లో ఊరేగించాడు" అని రాసుకొచ్చారు.
नोएडा में क्रूरता की पराकाष्ठा
— Priya singh (@priyarajputlive) September 19, 2023
लहसुन बेचने वाले युवक 5100 रुपए उधार लिए थे। 3100 रुपए बाकी रह गए थे। इसी बात पर उधार देने वाले ने युवक को नंगा करके मंडी में घुमाया। pic.twitter.com/0LvXkhCUgP












Click it and Unblock the Notifications