Viral Video: హెల్మెట్ పెట్టుకోలేదని చుక్కలు చూపించిన తల్లి.. వైరల్ అయిన వీడియో..
ఢిల్లీకి రాజైనా.. తల్లికే కొడుకే అంటారు. అది ప్రేమలోనే కాదు.. తప్పు చేస్తే శిక్షించడంలోనూ తల్లి ముందుంటుంది. తాజాగా ఓ కొడుకు హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డుపై వెళ్తుంటే చూసిన తల్లి కొడుతో పాటు కోడల్ని కూడా కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రద్దీగా ఉండే రోడ్డులో బుల్లెట్ బండి పై భార్యభర్తలు వెళ్తున్నారు. ముందు పోలీసులున్నారు. బండి వెనకాలే ఓ బండి నడుపతున్న వ్యక్తి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని కొడకు, కోడల్ని కొట్టింది.
వెంటనే అక్కడున్న పోలీసులు ఆమెను ఆపారు. ఇదంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.హెల్మెట్ ధరించలేదని కొడుకు, -కోడల్ని రోడ్డుపై కొట్టింది ఓ మహిళ. @iammaya_sharma అనే ట్విట్టర్ యూజర్ ద్వారా షేరైన ఈ వీడియో అందరిని ఆలోచింప చేస్తోంది. 'హెల్మెట్ ధరించనందుకు కొడుకుకి రోడ్డుపై బుద్ధి చెప్పిన తల్లికి సెల్యూట్ చేయాలి' అనే శీర్షికతో ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి.

తల్లి అంటే ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉందని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇలా చేస్తేనే కొడుకులు వింటారని కామెంట్ చేశారు. ఈ వీడియోకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ద్విచక్రవాహనం పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరిన పోలీసులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనం పై ఇద్దరు వెళ్తే ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని చెబుతున్నారు.
Salute such Mother who beat her son in the middle of the road for not wearing a helmet #IndiaTodayExactPoll #BJPMuktSouthIndia #RahulGhandi #Tejran #KarnatakaPolls pic.twitter.com/RFyJXwQXgj
— Maya Sharma 🇮🇳 (@iammaya_sharma) May 13, 2023
చాలా మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారని పోలీసులు తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎంత మంది రోడ్డు ప్రమాదాల నుంచి బయట పడ్డారని పేర్కొన్నారు.హెల్మెట్ పెట్టుకోకుంటే ఫైన్లు విధిస్తున్నామని.. కొంత మంది ఫైన్లు విధించిన మారడం లేదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications