Viral Video: యువతి కిడ్నాప్.. ఏడారిలోకి తీసుకెళ్లి పెళ్లి.. వైరల్ అయిన వీడియో..!
రాక్షస వివాహం అంటే పురాణాల్లో విన్నాం.. వధువు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. అయితే రాక్షస వివాహాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో జరిగిన రాక్షస వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి యువతిని ఎత్తుకుని గడ్డితో వేసిన అగ్ని చుట్టూ తిరుగుతూ కనిపించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో జరిగింది.
कुख्यात कांग्रेस कुशासन में जंगलराज कायम!
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) June 6, 2023
जैसलमेर में युवती का सरेआम अपहरण कर बंजर वीराने में उसके साथ जबरदस्ती शादी कर ली जाती है। ना कोई पुलिस आई, ना गिरफ्तारी हुई? सत्ता के संरक्षण में ऐसी घटनाओं से राजस्थान शर्मसार है! इन सब पर कब लगाम लगेगी ? कब तक हमारी बहन-बेटियां डर के… https://t.co/aIecGx7e6L pic.twitter.com/4h3omNXgOl
ఆప్ నేత నరేష్ బల్యాన్ ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు అనుమానితుల్లో ఎవరినీ అరెస్టు చేయలేదని ఆప్ నేత తన ట్వీట్‌లో తెలిపారు. జూన్ 1న జైసల్మేర్‌లోని సంఖ్లా గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిర్చయమైంది. అయితే పెళ్లికి ముందు ఆమెను 15-20 మందితో కూడిన ముఠా కిడ్నాప్ చేసింది. నిందితుల్లో ఒకరైన పుష్పేంద్ర యువతిని ఎత్తుకున్నాడు.

అక్కడే ఉన్న గడ్డిన పోగేసి అగ్ని రాజేశారు. పుష్పేంద్ర ఆ అగ్ని చుట్టు ఏడుసార్లు తిరిగాడు. మనకు పెళ్లి అయిపోయింది. నువ్వు వేరే వ్యక్తిన వివాహం చేసుకోవద్దని యువతిని పుష్పేంద్ర బెదిరించాడు. ఆ తర్వాత అమ్మాయిని విడిచి పెట్టాడు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుష్పేంద్ర, యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నరేష్ బల్యాన్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కూడా ట్వీట్‌లో ట్యాగ్ చేసి, "అవాంఛనీయ సంఘటన జరగడానికి మీరు వేచి ఉన్నారా?" అని సిఎంను ప్రశ్నించారు.భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మరియు జైపూర్ రూరల్ ఎంపీ కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా రాష్ట్రంలో "జంగల్ రాజ్"పై కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
"అపఖ్యాతి పాలైన కాంగ్రెస్ దుష్టపాలనలో జంగిల్ రాజ్! జైసల్మేర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేసి నిర్మానుష్య ఎడారిలో బలవంతంగా పెళ్లాడారు. పోలీసులు రాలేదు, అరెస్టు చేయలేదు? రాజస్థాన్ అధికార రక్షణలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటు! అంటు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications