Viral Video: జస్ట్ మిస్.. వైరల్ అవుతున్న విద్యార్థి వీడియో..
మను ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా స్కూల్ వెళ్లే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేలా తల్లితండ్రులు చూసుకోవాలి. ముఖ్యంగా బస్సుల్లో వెళ్తున్నప్పుడు ఫుట్ పాత్ పై ప్రయాణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

ఫుట్ పాత్
తాజాగా స్కూల్ పిల్లలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాఠశాల విద్యార్థులు బస్సు ఎక్కి వెళ్తున్నారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండడంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ పాత్ నిలుచుని ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో ఓ విద్యార్థి పట్టు తప్పి కింద పడిపోయాడు. అయితే విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

కనిష్క్ సింగ్
బస్సు వెనకాల వస్తున్న వారు విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణించడాన్ని వీడియో తీస్తున్నారు. ఈ లోపలే విద్యార్థి కింద పడిపోయాడు. ఇదంత వీడియోలో రికార్డు అయింది. ఈ వీడియోను కనిష్క్ సింగ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పోస్టుతో పాటు దేశం అంటే ఏమిటి సార్, ఇది దేశ భవిష్యత్తు.
తమిళనాడులోని చెంగల్‌పట్టులో బస్సు నుంచి పడిన విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడు. ఇది అవమానకరమని రాసుకొచ్చారు.
58 వేలకు పైగా వ్యూస్
ఈ వీడియోకు 58 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 3 వేలకు పైగా లైక్స రాగా 1400 రీట్వీట్లు చేశారు. నెటిజన్లు ఈ వీడియో పట్ల ఆందోళన చెందారు. ఈ విద్యార్థి చాలా అదృష్టవంతుడని ఒకరు కామెంట్ చేయగా. విద్యార్థులు జాగ్రత్త అంటూ మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications