Viral Video: వామ్మో పులి.. కొద్దిలో తప్పిన ప్రమాదం.. వైరల్ అయిన వీడియో..
పులి ఎంత డెంజరో అందరికి తెలుసు.. కొన్ని సార్లు పులితో కొందరు ప్రవర్తించే తీరు వాటిని ఆగ్రహానికి గురి చేస్తోంది. తాజాగా ఓ పార్క్ లో పర్యటకులపై దాడి చేసినంత పని చేసింది ఓ పులి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వద్ద పర్యాటక వాహనంపై పులి కోపంతో దూసుకుపోతున్నట్లు చూపించే వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు.
కోపోద్రిక్తురాలైన పులి ఆ వీడియోలో కారులో ఉన్న పర్యాటకులను గండ్రిస్తూ భయపెడుతోంది. వీడియో తీస్తూ పులి సమీపంలోకి రావడంతో మీద దూకేంత ప్రయత్నం చేసంది. ఆందోళన చెందిన పర్యాటకులు కారును రివర్స్ చేయమని డ్రైవర్‌ను ఆదేశించినట్లు వీడియోలో చూడొచ్చు. సుశాంత నందా వీడియోతో పాటు "చారల సన్యాసికి చిరాకు వస్తుంది. ప్రతి నిర్ణీత గంటలలో ప్రజలు తమ హక్కుగా మీ ఇంట్లోకి దూసుకుపోతే మీరు ఏమి చేస్తారు? అని క్యాప్షన్‌గా పెట్టాడు.

వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వ్యక్తి "ఇది ఇప్పుడు ఆనవాయితీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. టూరిజం/రిజర్వ్ ఫారెస్ట్‌లలో తగిన ప్రవర్తన గురించి కొన్ని పరిచయ తరగతులు వైవిధ్యాన్ని కలిగిస్తే ఆశ్చర్యంగా ఉందా?" అంటూ కామెంట్ చేశారు. "సఫారీ సంఖ్యలను తగ్గించాల్సిన అవసరం ఉందని మరొకరు కామెంట్ చేశారు.
Striped monk gets irritated 😣
— Susanta Nanda (@susantananda3) April 26, 2023
What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR
మరో ఘటనలో ఓ పులి ఓ గ్రామంలోకి వచ్చి గోవులను, దూడను వెంబడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఓ గ్రామంలోని బీడు భూమిలో ఓ పులి గోవులను, ఒక దూడను వెంబడిస్తూ ఉంటుంది. అయితే ఆ గోవులు తప్పించుకోవడంతో అందులో ఉండే దూడ వెంట ఆ పులి పరిగెడుతుంది. కొంతసేపు పరిగిత్తిన తర్వాత చివరికి ఆ దూడను పట్టుకుంటుంది. కానీ వెంటనే ఆవు పులిపైకి దూసుకురావడంతో పులి పలాయనం చిత్తగించింది.












Click it and Unblock the Notifications