Viral Video: నన్నే ప్రశ్నిస్తావా.. కోపంతో వృద్ధుడిపై కర్రతో దాడి చేసిన యువతి..
ఈ మధ్య కొంత మంది చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. పెద్దలు ఇది తప్పు అని చెబితే మండిపడిపోతున్నారు. తాజాగా ఓ యువతి కోపంతో వృద్ధుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఘజియాబాద్‌లోని క్రాసింగ్స్ రిపబ్లిక్ టౌన్‌షిప్‌లోని పంచశీల్ వెల్లింగ్‌టన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 22 ఏళ్ల యువతి 75 ఏళ్ల వృద్ధుడిపై కర్రతో దాడి చేసింది. దీంతో యువతిపై సీనియర్ సిటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మంగళవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో సదరు యువతి వీధి కుక్కలకు ఆహారం పెడుతుంది. అయితే ఇలా చేస్తే వీధి కుక్కులు రోజు ఇక్కడే వస్తాయి. అందిరికి ఇబ్బంది అవుతుందని ఓ వృద్ధుడు ఆమెతో చెప్పాడు. దీంతో కోపంతో రెచ్చిపోయిన యువతి వృద్ధుడిపై కోపంతో ఊగిపోయారు. కర్రతో దాడి చేశారు. అక్కడే ఉన్న కొంత మంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వినలేదు. యువతి వృద్ధుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వృద్ధుడిని రూప్ నారాయణ్ మెహ్రాగా పోలీసులు గుర్తించారు.. నిందితురాలిని సిమ్రాన్‌గా గుర్తించారు. "మహిళ వృద్ధుడిని కొట్టింది. అతనికి గాయాలయ్యాయి. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. మేము కఠిన చర్యలు తీసుకుంటాము. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 323, 504 కింద మహిళపై కేసు నమోదు చేశాం. నాన్-కాగ్నిసబుల్ రిపోర్ట్ దాఖలు చేశాం. ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.
ఈ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని డీసీపీ తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (కాగ్నిజబుల్ నేరాలకు వ్యతిరేకంగా రక్షణ) 151 కింద మహిళను అధికారికంగా అరెస్టు చేశామని, ACP కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు డీసీపీ గురువారం ఉదయం తెలిపారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు నారాయణ్ మెహ్రా తెలిపారు. యువతి గతంలో ఇతర నివాసితులకు కూడా ఇబ్బంది కలిగించిందని చెప్పారు.
"మంగళవారం రాత్రి, నేను సొసైటీ లోపలికి నడుచుకుంటూ వెళుతుండగా అనుమానిత మహిళ, ఆమె తల్లిని చూశాను. వారి వద్ద ఒక కుక్క పట్టీపై ఉండగా, వారి వెనుక మరొక కుక్క ఉంది. పట్టీ లేని కుక్క తనదా అని నేను ఆమెను అడిగాను. ఆమె నా ప్రశ్నకు చికాకుపడింది. నాపై అరవడం ప్రారంభించింది.నన్ను మాటలతో దుర్భాషలాడింది "అని మెహ్రా చెప్పారు. వాగ్వాదం కొద్దిసేపటికే హింసాత్మకంగా మారిందని చెప్పారు.
Ghaziabad News
— Asia Manch News (@AsiamanchYt) August 2, 2023
गाजियाबाद में डंडे वाली मैडम का शोर : सोसाइटी में डंडा लेकर चलती है, बुजुर्ग को पीटने का आरोप, वीडियो वायरल @ghaziabadpolice @Uppolice #Ghaziabad pic.twitter.com/hDHC4qCSNS
"ఆమె గార్డు దగ్గరికి వెళ్లి వారి లాఠీలు అందుకుని నన్ను కొట్టడం ప్రారంభించింది. ఇది చూసి షాక్ అయ్యి నన్ను నేను రక్షించుకోవడానికి ప్రయత్నించాను. కానీ అప్పటికి ఆమె నా శరీరంపై అనేక దెబ్బలు వెసింది. నేను దాడిని తప్పించుకుంటూనే ఉన్నాను. చాలా మంది నివాసితులు చూస్తున్నారు. గార్డులు కూడా దాడిని ఆపడానికి జోక్యం చేసుకోలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాను. నాకు చాలా గాయాలయ్యాయి" అని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications