Lady Shaving: సెలూన్‍కు వెళ్లి షేవింగ్ తీసుకున్న లేడీ..
హెయిర్ కటింగ్ సెలూన్ కు ఎందుకు వెళ్తారు. ఏముంది కటింగ్ తీసుకోవడాని లేకుంటే గడ్డం తీసుకోవడానికి లేకుంటే రెండూ తీసుకోవడానికి వెళ్తారు. ఇందులో వింత ఏముంది అంటారా.. అయితే ఓ చోట ఓ అమ్మాయి సెలూన్ కు వెళ్లింది. ఆమె సెలూన్ కటింగ్, గడ్డం తీయడానికి వెళ్లలేదు.. తానే గడ్డం తీసుకునేందుకు వెళ్లింది. అమ్మాయిలకు గడ్డముంటందా బాస్ అని మీరు అడగొచ్చు కానీ ఆ అమ్మాయి మాత్రం షేవింగ్ తీయించుకోవడానికి సెలూన్ వెళ్లింది.
ఆమె షేవింగ్ తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడయోలో ఓ వ్యక్తి ఆ యువతికి గడ్డం తీస్తున్నాడు. మగవారి ఎలా షేవింగ్ చేస్తారో అలానే ఆ అమ్మాయికి కూడా షేవింగ్ చేశాడు. మొదటగా ఆమె మూతి కింద క్రీమ్ రాశాడు. బ్రష్ తో దాన్ని స్రెడ్ చేశాడు. తర్వాత బ్లెడ్ తో షేవింగ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఎలాంటి భయం లేకుండా షేవింగ్ తీయించుకుంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియోపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. గడ్డం ఎక్కడుంది అని ఒకరు.. నువ్వు గ్రేట్ అని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇలాంటి పనులు చేస్తారని కొందరు కామెంట్ చేశారు. కొందరు ఎవరి పిచ్చి వారికి ఆనందమంటూ కామెంట్ చేశారు. ఓ వ్యక్తి జంబలకిడిపంబ సినిమా గుర్తొంచిందన్నారు. అయితే సదరు యువతి మాత్రం అందం కోసమే షేవింగ్ చేయించుకున్నట్లు చెప్పారు.
రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదన్నారు. దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా మారుతుందని పేర్కొన్నారు. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని ఆమె చెప్పారు. దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా వివరించారు. అయితే ఆమె కావాలని అలా చేసినట్లు విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications