Viral Video: మలివయస్సులో కూడా వీడని బంధం.. ఇదే అస్సలైన భార్యభర్తల సంబంధం..

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లితో రెండు హృదయాలతో పాటు రెండు కుటుంబాలు దగ్గర అవుతాయి. వేదమంత్రాల సాక్షిగా పెళ్లికొడకు, పెళ్లికూతురు ప్రమాణం చేస్తారు. ధర్మేచా, అర్థచా, కామెచా, మొక్షేచా, నాతి చెరామి మంత్రాల మధ్య వివాహం జరుగుతుంది. భార్యభర్తలు చివరి వరకు కలిసి ఉంటామని, కష్టసుఖాల్లో, సుఖదుఃఖల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు.

ఇలా పెళ్లి అనే పవిత్ర బంధానికి అందరు కట్టుబడి ఉండాలి. ఉంటారు కూడా. ఇలానే ఓ వృద్ధ జంట ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ వృద్ధ దంపతులు రోడ్డుపై వెళ్తున్నారు. అయితే వారు రోడ్డుపై కష్టంగా నడుస్తున్నారు. ముందు భర్త వెళ్తుండగా అతని వెనక భార్య వెళ్తోంది.

A video of an elderly couple walking on the road is going viral on social media

చేతిలో కర్రలు పట్టుకుని రోడ్డుపై ఒకరికొకరు తోడు వెళ్తుంటే.. ఇదే కదా పెళ్లి ఉన్న పవిత్రత అనిపిస్తుంది. వారు వెళ్తున్నప్పుడు ఎవరు తమ మొబైల్ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను ప్రతిమ చౌహన్ అనే మహిళ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

ఈ వీడియోను బుధవారం నైట్ పోస్ట్ చేయగా.. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. 10 వేలకు పైగా లైక్స్ రాగా.. 12 వందలకు పైగా రీట్వీట్లు చేశారు. ప్రతిమ చౌహన్ పోస్ట్ తో పాటు జీవిత భాగస్వామి అవసరం ఈ దశలో వస్తుందని రాశారు. జై గోవిందా శుభ సాయంత్రం !! అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+