వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: నువ్వు ఖాకీవా.. కామాంధుడివా.. మహిళపై ఏఎస్పీ అరాచకం..

|
Google Oneindia TeluguNews

పోలీసులంటే క్రమశిక్షణతో ఉండాలి. ప్రజలకు భరోసా కల్పించాలి. ముఖ్యం పోలీసు అధికారులు బాధ్యతగా ఉండాలి. కానీ ఒడిశాలో ఓ పోలీస్ అధికారి చేసిన పనికి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఒడిశాలోని బరగఢ్‌ జిల్లాకు చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో కలిసి పపడాహండిలో ఎవరికి తెలియకుండా ఉంటుంది. అయితే విషయం ఆమె కుటుంబీకులు తెలిసింది.

ఏఎస్పీ ఆగ్రహం

ఏఎస్పీ ఆగ్రహం


వారు స్థానిక ఏఎస్పీ జయకృష్ణ బెహరాతో మాట్లాడారు. జయకృష్ణ ఆమె ఉన్న ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం కనుగొని, బలవంతంగా తన వాహనంలోకి ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. లాక్కెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున ఆర్తనాదానాలు చేయడంతో అక్కడికి మీడియా చేరుకుంది. ఇది గమనించిన ఏఎస్పీ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులపై లాఠీ ఛార్జ్

అయితే జయకృష్ణ యువతితో ప్రవర్తించిన తీరు మీడియా వాళ్లు రికార్డు చేశారు. దీంతో పోలీసులు పాత్రికేయులపై దాడి చేశారు. అడ్డుకొన్న మహిళలను కూడా కొట్టారు. ఆ యువతిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే లాఠీ ఛార్జ్, ఏఎస్పీ ప్రవర్తిన తీరుపై జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ భాస్కర్‌ ఘటనా స్థలానికి చేరుకుని మీడియాతో చర్చలు జరిపారు.

అసభ్య ప్రవర్తన

ఏఎస్పీ జయకృష్ట యువతితోపాటు అడ్డొచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీడియాపై లాఠీ ఛార్జ్, అసభ్య ప్రవర్తనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. ఎస్పీ సుశ్రీ సెలవులో ఉండటంతో కొరాపుట్‌ జిల్లా ఎస్పీ వరుణ్‌ గుంటువల్లి ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తూ ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ బ్రహ్మ దర్యప్తు నియమించారు.

ప్రతిపక్షాల ఆందోళన

ప్రతిపక్షాల ఆందోళన


ఈ ఘటనపై ప్రతిపక్షలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్, బీజేపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏఎస్పీ జయకృష్ణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. పలు చోట్ల ఆందోళనకు దిగాయి.

English summary
In Odisha, an ASP misbehaved with a young woman. This video is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X