Viral Video: పెళ్లి ఆపి వధువును ఈడ్చుకెళ్లిన పోలీసులు.. వీడియో వైరల్..
గుడిలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మాయి, అబ్బాయి పీటలపై కుర్చున్నారు. పంతులు మంత్రాలు చదువుతున్నారు. వరుడు అమ్మాయికి తాళి కట్టడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఆగండి అని శబ్దం వినిపించింది. ఎవరా అని చూసేసారికి పోలీసులు క్షణాల్లో పెళ్లిమండంలోకి వచ్చిన పోలీసులు పెళ్లి కూతురును లాక్కెళ్లారు. తనను వదిలేయండి అని వధువు ప్రధేయపడినా పోలీసులు వినలేదు. బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

పెళ్లి కొడుకు అడ్డుకున్న పోలీసులు వినకుండా వధువును లాక్కెళ్లడం అక్కడున్న వారు వీడియో తీశారు. వీడియోను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు ఉన్నతాధికారులు స్పందించారు. వరుడు అఖిల్, వధవు అల్ఫియా ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్పారు. వారి పెళ్లి ఇంట్లో వారు ఒప్పుకోలేదని.. దీంతో వారు గుడిలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.

అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కిడ్నాప్ అయిందని ఫిర్యాదు చేశారని.. అందుకే అమ్మాయిని కోర్టులో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.కోర్టులో అల్ఫియా అఖిల్ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిని అక్కడి నుంచి బయటకు పంపారని వివరించారు. కొంతమంది మహిళా పోలీసు అధికారులు వధువును భౌతికంగా లాగడం, ఆమెను కారులోకి నెట్టడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వరుడిని కూడా తోసి వధువు దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడంపై కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది.
A Muslim woman who had decided to live with a Hindu man was forcibly taken away by a police team just before her wedding!!
— महारथी-മഹാരഥി (@MahaRathii) June 18, 2023
Alfia, a native of Kayamkulam, and Akhil, a native of KS Road, Kovalam, were in love. Last Friday, Alfia made the decision to live with Akhil and arrived in… pic.twitter.com/NWI9egsQLq
"కాయంకుళం నుంచి పోలీసులు రెండు వాహనాల్లో వచ్చారు. పెళ్లి జరగకుండా చేసి అల్పియాను బలవంతంగా ఈడ్చుకెళ్లారు" అని అఖిల్ చెప్పాడు. ఆ తర్వాత వధువును మెజిస్టీరియల్ కోర్టుకు తీసుకెళ్లారని, అక్కడ ఆమె తన ఇష్టానుసారం వరుడితో వెళ్లిపోయానని, అతనితో వెళ్లాలనుకుంటున్నానని వాంగ్మూలం ఇచ్చిందని దంపతులు సోమవారం మీడియాకు వెల్లడించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications