Viral Video: వయస్సులో చిన్న అయినా మనస్సులో చాలా పెద్దోళ్లు ఈ చిన్నారులు.. వీడియో వైరల్..
సాయం చేయడానికి వయస్సుతో సంబంధం లేదు. హెల్ప్ చేయాలని ఆలోచన ఉంటే చాలు. ఇలానే ఇద్దరు చిన్నారులు చేసిన సాయం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డుపై నాలుగు చక్రల బండిపై పండ్లు అమ్ముతోంది.

ముందుకొచ్చిన చిన్నారులు
అయితే ఆమె ఆ పండ్ల బండిని తోసుకుంటూ మరో చోటికి వెళ్తోంది. వెళ్తున్నదారిలో ఎత్తుగడ్డ వచ్చింది. దీంతో ఆమె తన బలాన్ని అంత కూడదీసుకుని బండిని ముందుకు నెట్టుతోంది. కానీ ఆమెకు సాధ్యం కావడం లేదు. చాలా మంది ఆమెను చూస్తూ వెళ్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. కానీ ఆమె కష్టాన్ని చూసిన ఇద్దరు చిన్నారులు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

4 లక్షలకు పైగా వ్యూస్
ఆమెకు సాయం చేస్తూ బండిని ముందుకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. మహంత్ ఆదిత్యనాథ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో,ఎప్పుడు జరిగిందో క్లారిటీ లేదు. కానీ చిన్ని పిల్లల మనస్సుకు అందరూ ఫిదా అయిపోతున్నారు.
నెటిజన్లు ఫిదా
బండి తోయడానికి సహాయం చేసిన పాప, బాబుకు పండ్లు అమ్మే మహిళ అరటి పండును బహుమతిగా ఇచ్చింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్నారులను ప్రశంసిస్తున్నారు. పండ్లు అమ్మే మహిళను కూడా మెచ్చుకుంటున్నారు. పిల్లలు చిన్నవారైనా వారి మనస్సు చాలా పెద్దది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications