Viral Video: దొంగలతో మహిళా కానిస్టేబుళ్ల వీరోచిత పోరాటం.. వైరల్ అయిన వీడియో..
దొంగలోత వీరోచితంగా పోరాడి ప్రజల సొమ్మును కాపాడారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్‌లో ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ వద్ద జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సాయుధ దొంగలు
బుధవారం బ్యాంకులో దోపిడీ చేసేందుకు ముగ్గురు సాయుధ దొంగలు బ్యాంకులోకి ప్రవేశించారు. అక్కడే డ్యూటీలో ఉన్న ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు వారిని ధైర్యంగా అడ్డుకున్నారు. ముగ్గురు దొంగలు సాధారణ పౌరులలాగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో జుహీ కుమారీ, శాంతీ కుమారీ ప్రశ్నించారు. తమకు బ్యాంకులో పని ఉందని దొంగలు చెప్పారు. ఆ వెంటనే మీ బ్యాంక్ పాస్ బుక్ చూపించాలని మహిళా కానిస్టేబుళ్లు కోరారు.

రివాల్వర్
ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి రివాల్వర్ బయటకు తీసి బెదిరించే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జుహీ, శాంతి తమ తుపాకులతో వారిని అడ్డుకున్నారు. దొంగలు వద్ద ఆయుధాలు ఉన్నప్పటికీ జుహీ, శాంతి భయపడకుండా దొంగలను ప్రతిఘటించారు. దీంతో ఆ ముగ్గురు దొంగలు పలయానం చిత్తగించారు. ఇదంతా బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

సోషల్ మీడియా
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ చెప్పారు.
గాయాలు
"ముగ్గురిని బ్యాంకులో పని ఉందా అని నేను అడిగాను, వారు అవును అని చెప్పారు. నేను పాస్‌బుక్ చూపించమని అడిగాను. వారు తుపాకీని బయటకు తీశారు" అని జూహీ చెప్పారు. ఈ ఘటనలో జూహీ స్వల్పంగా గాయపడింది.
"వారు మా రైఫిల్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఏమి జరిగినా మేము వారిని బ్యాంకును దోచుకోవడానికి లేదా మా ఆయుధాన్ని తీసుకోనివ్వమని మేము నిర్ణయించుకున్నాము. జూహీ తన తుపాకీని వారిపైకి లాక్కెళ్లింది మరియు వారు పారిపోయినప్పుడు కాల్చడానికి సిద్ధంగా ఉంది" అని శాంతి చెప్పింది. ప్రస్తుతం పోలీసులు ఆ దొంగల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications