ఓటుకు రూ. 4,000: వీడియోలో అడ్డంగా, దినకరన్ గ్యాంగ్ పరుగో పరుగు!

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గంలోని అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ. దినకరన్ చేతి వాటం చూపిస్తున్నారని స్పష్టంగా వెలుగు చూస్తోంది. తాజాగా ఆయన అనుచరులు ఓటర్లకు డబ్బలు పంపిణి చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని శశికళ వర్గం రోజుకు ఒక ఎత్తుగడ వేస్తోంది. స్థానిక ఓటర్లకు డబ్బు, ఖరీదైన బహుమతులు ఇస్తూ టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని ప్రచారం చేస్తున్నారు. ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల అనుచరుల మీద ఎన్నికల కమిషన్ గట్టి నిఘా వేసింది.

ఎన్నికల కమిషన్ కళ్లుగప్పి ఎలాగైనా ఓటర్లకు డబ్బు పంపిణి చెయ్యాలని టీటీవీ. దినకరన్ అనుచరులు ప్లాన్ వేస్తున్నారు. మంగళవారం రాత్రి దినకరన్ అనుచరులు ఆర్ కే నగర్ లో విచ్చలవిడిగా డబ్బు పంపిణి చేశారు.

టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని ఒక్కోక్క ఓటరకు వారి ఇంటిలోనే రూ. 4,000 ( రూ. 2,000 నోట్లు) పంచిపెడుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా మొబైల్ లో వీడియో చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో ఎన్నికల అధికారులకు ఇవ్వడంతో దినకరన్ అనుచరులు అడ్రస్ లేకుండా మాయమైనారు. దినకరన్ అనుచరులు ఎలా డబ్బు పంపిణి చేస్తున్నారో ఈ వీడియోలో మీరే చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+