వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్ననాటి జయ.. చదువుకునే రోజుల్లో ఇలా ఉండేది!

చిన్ననాటి జయ.. చదువుకునే రోజుల్లో ఇలా ఉండేది!

|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత చిన్ననాటి ఫోటోను బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విడుదల చేసింది. అమ్మ మరణం నేపథ్యంలో.. జయ చదువుకున్న బిషప్ స్కూల్ యాజమాన్యం నేడు దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది. 1957లో ఈ ఫోటోగ్రాఫ్ తీసినట్లుగా తెలుస్తోంది.

A wide eyed little girl with pigtail

తమ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన జయ అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి ఎదగడంతో.. ఆ ఫోటోను స్కూల్ యాజమాన్యం భద్రంగా కాపాడుకుంటూ వస్తోంది.

పైన కనిపిస్తున్న ఫోటోలో కింది వరుసలో కుడివైపు నుంచి అమాయకంగా.. కాస్త కోపంగా కూర్చున్న చిన్నారి జయను చూడవచ్చు. జయ మరణ వార్త తెలిసిన తర్వాత ప్రస్తుత బిషాప్ స్కూల్ ప్రిన్సిపాల్ దీనిపై స్పందించారు. జయలలిత మంచి క్రీడాకారిణి అని, ఆమె సీఎం అయ్యాక ప్రమాణ స్వీకారం సందర్బంగా తనకు రెండుసార్లు ఆహ్వానం పంపించిందని గుర్తుచేసుకున్నారు.
ఆ కార్యక్రమాలకు తాను హాజరైనట్లుగా చెప్పారు.

ప్రస్తుత బిషాప్ స్కూల్ విద్యార్థులు అమ్మ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. జయలలితను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని పేర్కొన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తామని, బడుగు బలహీన వర్గాల కోసం ఆమె చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని ప్రశంసించారు.

English summary
As AIADMK chief Jayalalithaa was being sworn in as Tamil Nadu Chief Minister, a small circle of people in this city, who once knew her as a little wide-eyed girl with pigtail, excitedly recalled those days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X