ప్రియుడికి పిస్తా, డ్రైఫ్రూట్స్, భర్తకు బ్రెండ్, జామ్, రెండేళ్లు వెతికి వెతికి స్పాట్ లో లేపేసిన భర్త !
బెంగళూరు/కోల్ కత్తా: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల తరువాత దంపతులు ఉద్యోగాలు చెయ్యడానికి ఐటీ హబ్ వచ్చారు. ఆ సందర్బంలో భార్య ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్తకు మ్యాటర్ లీక్ కావడంతో అతని భార్యను సొంత రాష్ట్రానికి పిలుచుకుని వెళ్లిపోయాడు. తరువాత భార్య ఆమె భర్తను వదిలేసి ప్రియుడి దగ్గరకు వెళ్లి ఓ బిడ్డకు తల్లి అయ్యింది. చాలా కాలం టైమ్ కోసం వేచి చూసిన భర్త అతని భార్య అడ్రెస్ కనుక్కొని వెళ్లి అతని భార్యను పట్టుకుని ఏం చేశాడంటే ?.

14 ఏళ్ల క్రితం పెళ్లి
పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా సమీపంలో నివాసం ఉంటున్న షేక్ సోహైల్ అలియాస్ సోహైల్ అనే యువకుడికి, తబ్సంబి అనే యువతికి 14 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లికావడంతో సోహైల్, తబ్సంబి దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. వివాహం చేసుకున్న 9 సంవత్సరాల పాటు సోహైల్ అతని భార్య తబ్సంబి కోల్ కత్తాలోనే పని చేస్తూ అక్కడే నివాసం ఉండేవారు.

బెంగళూరులో ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
ఐదు సంవత్సరాల క్రితం సోహైల్ అతని భార్య తబ్సంబిని పిలుచుకుని ఉద్యోగాలు చెయ్యడానికి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్నారు. సంంవత్సరం పాటు పనికి వెళ్లి జీతం తీసుకుని వచ్చి భర్త సోహైల్ కు ఇచ్చి అతనితో చాలా సంతోషంగా ఉండేది, ఆదే సమయంలో తనతోపాటు ఉద్యోగం చేస్తున్న నయిమ్ అనే వ్యక్తితో తబ్సంబికి పరిచయం అయ్యింది. తరువాత నయిమ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న తబ్సంబి ఆమె భర్తకు తెలీకుండా ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

బెంగళూరు ఖాళీ చేసిన భర్త
సంవత్సరం పాటు తబ్సంబి ఆమె ప్రియుడు నయిమ్ బెంగళూరులో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. భర్త సోహైల్ కు మ్యాటర్ తెలీకుండా తబ్సంబి అనేక జాగ్రత్తలు తీసుకుంది. అయితే మూడు సంవత్సరాల క్రితం సోహైల్ కు అతని భార్య తబ్సంబి అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. భార్య తబ్సంబికి బుద్దిమాటలు చెప్పినా ఆమె మాత్రం ప్రియుడిని వదల్లేకపోయింది. ఇక లాభం లేదని తెలుసుకున్న సోహైల్ అతని భార్యకు మాయమాటలు చెప్పి ఆమెను కోల్ కత్తా పిలుచుకుని వెళ్లిపోయాడు.

ప్రియుడి కోసం భర్తను వదిలేసింది
భర్త సోహైల్ తో కలిసి కోల్ కత్తా వెళ్లిన తబ్సంబి బెంగళూరులో ఉన్న ప్రియుడు నయిమ్ తో నిత్యం టచ్ లో ఉంది. సుమారు ఏడాది పాటు నేరుగా కలుసుకోలేకపోయినా ఇద్దరూ మాత్రం ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం తబ్సంబి భర్తకు సోహైల్ కు గుడ్ బై చెప్పేసి బెంగళూరు వచ్చేసింది. ప్రియుడు నయిమ్ తో కలిసి హెణ్ణూరు సమీపంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మేము దంపతులు అంటూ ఇద్దరూ కాపురం పెట్టారు. అయితే నయిమ్, తబ్సంబి మాత్రం పెళ్లి చేసుకోలేదు.

ప్రియుడితో ఎంజాయ్ చేసి తల్లి అయ్యింది
పెళ్లి చేసుకోకుండానే ప్రియుడు నయిమ్ తో రొమాన్స్ చేసిన తబ్సంబి ఓ బిడ్డకు తల్లి అయ్యింది. బెంగళూరులో ప్రియుడు నయిమ్ తో కలిసి తబ్సంబి ఎంజాయ్ చేస్తుంటే ఆమె భర్త సోహైల్ కోల్ కత్తాలో సుమారు రెండు సంవత్సరాలు ఒంటరి జీవితం గడిపాడు. తబ్సంబి కోల్ కత్తాలోని బంధువులకు ఫోన్ చేసి మాట్లాడుతూ తాను బెంగళూరులో క్షేమంగా ఉన్నానని సమాచారం ఇచ్చింది. ఇదే సమయంలో తబ్సంబి ఆమె ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా ఓ బంధువుకు ఇచ్చింది. భార్య తబ్సంబి అడ్రస్ ఆమె భర్త సోహైల్ కు తెలిసిపోయింది.

బెంగళూరులో భార్య ఇంటిని ట్రేస్ చేసిన భర్త
కోల్ కత్తా నుంచి బయలుదేరిన సోహైల్ మూడు రోజుల క్రితం బెంగళూరు చేరుకున్నాడు. తరువాత భార్య తబ్సంబి, ఆమె ప్రియుడు నయిమ్ నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. నయిమ్ బయటకు వెళ్లిన తరువాత నేరుగా అక్కడికి వెళ్లిన సోహైల్ నువ్వు నన్ను వదిలేసి విడాకులు కూడా తీసుకోకుండా నీ ప్రియుడితో జల్సా చేసి ఓ బిడ్డకు తల్లి అవుతావా అంటూ అతని భార్య తబ్సంబితో గొడవపెట్టుకున్నాడు. ఆ సందర్బంలో తబ్సంబి, సోహైల్ మధ్య మాటామాటా పెరిగిపోయింది.

ప్రియుడి ఇంట్లో భార్యను స్పాట్ లో చంపేసిన భర్త
భార్య తబ్సంబి తప్పు చెయ్యడమే కాకుండా ఎదురుతిరగడంతో అప్పటికే పీకలదాక మద్యం సేవించిన సోహైల్ కత్తి తీసుకుని అతని భార్యను దారుణంగా పొడిచేశాడు. తీవ్రగాయాలైన తబ్సంబి స్పాట్ లో చనిపోయింది. భార్యను చంపేసిన సోహైల్ అక్కడే ఉన్నాడు, ఇంటికి వెళ్లిన ప్రియుడు నయిమ్ అతని ప్రియురాలు హత్యకు గురైన వియం గమనించి హోణ్ణూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సోహైల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నాకు ద్రోహం చేసిన తన భార్య ఇక్కడ ప్రియుడితో జల్సాలు చేస్తోందని, అందుకే తబ్సంబిని చంపేశానని సోహైల్ నేరం అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications