wife: మొగుడి మీద మోజు తీరిపోయింది, ప్రియుడి మీద కోరికలు ?, మంచం కింద కొడుకు ?
పెద్ద కొడుకును పుట్టింటిలో వదిలేసిన కిలాడీ లేడి ఆమె ప్రియుడితో లేచిపోయింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో మహిళ కొడుకు మంచం కింద ఉన్నాడు. తరువాత ?.
అహమ్మదాబాద్/గుజరాత్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య పంచాయితీలు ఎక్కువ అయ్యాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో దంపతులు విడిపోయారు. భర్దను వదిలేసి పుట్టింటిలో ఉంటున్న మహిళ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. పెద్ద కొడుకును పుట్టింటిలో వదిలేసిన కిలాడీ లేడి ఆమె ప్రియుడితో లేచిపోయింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో మహిళ కొడుకు మంచం కింద కొడుకు ఉన్నాడు.

ఇద్దరు పిల్లలు
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వాఘర్ ప్రాంతంలో సలీమ్ బాయ్ అలియాస్ సలీమ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ుంటున్న హుసేనా అలియాస్ హసీనా అనే మహిళకు 8 ఏళ్ల క్రితం సలీమ్ వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన సలీమ్ ,హసీనా దంపతులకు రెహాన్ (4), ఆర్యన్ (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

భర్తకు బాయ్ బాయ్ చెప్పింది
సలీమ్, హసీనా దంపతులు రెండు సంవత్సరాల వరకు చాలా సంతోషంగా ఉండేవారు. కొంతకాలంగా సలీమ్, హసీనాల మధ్య నిత్యం గొడవలు జరగడంతో పెద్దలు పంచాయితీలు చేశారు. అయితే హసీనా ఆమె భర్త సలీమ్ నుంచి విడిపోయి ఆమె తల్లి ఇంటికి వెళ్లింది. హసీనాతో పాటు ఆమె ఇద్దరు కుమారులు ఉంటున్నారు. సలీమ్ మాత్రం వేరుగా నివాసం ఉంటున్నాడు.

మొగుడ్ని వదిలేసి ప్రియుడిని సెట్ చేసుకుంది
కొన్ని నెలల క్రితం బాకీర్ అనే యువకుడితో హసీనాకు పరిచయం ఏర్పడింది. రానురాను భర్తను వదలేసిన హసీనాను జాకీర్ వలలో వేసుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న హసీనా, జాకీర్ ఇద్దరు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. అక్రమ సంబంధానికి తన పిల్లలు అడ్డుపడుతున్నారని భావించిన తల్లి హసీనా వారిని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది.

ప్రియుడితో జంప్
తన మాజీ భార్య హసీనా అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని హసీనా మాజీ భర్త సలీమ్ కూడా తెలియడంతో అతను అప్పుడప్పుడు మాజీ భార్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడుతున్నాడు. కొన్ని నెలల క్రితం హసీనా ఆమె తల్లి ఇంటిని విడిచిపెట్టి ప్రియుడు జాకీర్‌తో కలిసి వేరే ఇంట్లో నివసించడం ప్రారంభించింది. కొన్ని నెలల పాటు ఇద్దరూ ఎంజాయ్ చేశారు.

నీ కొడుకు చనిపోయాడు
తన 4 ఏళ్ల పెద్ద కొడుకును పుట్టింటిలో వదిలిన హసీనా ఆమె రెండేళ్ల కుమారుడు ఆర్యన్‌ను వెంట తీసుకుని ఆమె ప్రియుడు జాకీర్ తో కలిసి ఊరు వదిలివెళ్లిపోయింది. మార్చి 8వ తేదీన తండ్రి సలీమ్ కు అతని 2 సంవత్సరాల కుమారుడు ఆర్యన్ అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం అందింది. రెండు ఏళ్ల కుమారుడు శవాన్ని చూసిన సలీమ్ షాక్ అయ్యాడు.

మంచం కింద కొడుకు ఏడుస్తున్నాడని ?
ఆర్యన్ పొత్తికడుపు మరియు వీపుపై గాయాలతో పాటు ఎర్రగా కమిలిపోయిన మచ్చలు ఉన్నాయని గుర్తించిన సలీమ్ కు అనుమానాలు ఎక్కువ అయ్యాయి, తన మాజీ భార్య హసీనా ఆమె ప్రియుడు జాకీర్‌తో కలిసి తన కుమారుడు ఆర్యన్ ను కొట్టి చిత్రహింసలు పెట్టి చంపారని సలీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్యన్ కు పోస్టుమార్టం నిర్వహించగా, చిత్రహింసల కారణంగానే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. సలీమ్ ఫిర్యాదు మేరకు అతని మాజీ భార్య హసీనా, ఆమె ప్రియుడు జాకీర్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు. ప్రియుడి మోజులో కన్నబిడ్డను తల్లి హత్య చెయ్యడం గుజరాత్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications