సూర్య సినిమాలోలా: యువతి కడుపులో హెరాయిన్, కోసి తీశారు

చెన్నై: తమిళ నటుడు సూర్య నటించిన ఓ సినిమాలో అతని స్నేహితుడు హెరాయిన్ మత్తు పదార్థాన్ని కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేసినట్లుగానే ఓ యువతి నిజజీవితంలోనూ చేసింది. అయితే, ఆమె కస్టమ్స్ అధికారులు, పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేసి హెరాయిన్ ప్యాకెట్లు, ట్యాబ్లెట్లను బయటికి తీశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. శ్రీలంకలోని యాల్‌ పానానికి చెందిన చాందినీ(27) పర్యాటకురాలిగా చెన్నైకు వచ్చింది. ముందే లభించిన రహస్య సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విమానాశ్రయంలో విచారించారు. ఈ సందర్భంగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం బలపడింది.

A woman arrested in Chennai airport

అధికారులు కార్యాలయానికి తీసుకెళ్లి విచారించి తనిఖీ చేసినా ఏమీ లభించలేదు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌, ఎక్స్‌రే తీయించడంతో కడుపులో ఏదో వస్తువు ఉన్నట్లు బయటపడింది. చివరకు చాందినీ తన కడుపులో ట్యూబ్‌ మాత్రలలో హెరాయిన్‌ ఉన్నట్లు అంగీకరించింది.

వెంటనే అధికారులు శస్త్ర చికిత్స ద్వారా ఒక కిలో హెరాయిన్‌తో నింపి ట్యూబు మాత్రలను వెలికి తీశారు. అంతర్జాతీయంగా దీని విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమెను అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా ముఠా సభ్యురాలిగా అధికారులు గుర్తించారు. ఈ మాత్రలను చెన్నైలో ఎవరికి సరఫరా చేయడానికి తీసుకొచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+