పాలు తాగించే విషయంలో భర్తతో గొడవ, నాలుగో అంతస్తు మీదకు వెళ్లి ఏం చేసిందంటే ?
వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఓ పాప ఉంది. భర్త, అత్తమామలతో కలిసి ఆమె ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నది. అయితే చిన్న విషయంలో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తరువాత ఆ మహిళ నాలుగో అంతస్తు నుంచి కిందపడి ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన బెంగళూరులోని బేగూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గర్వేబావిపాళ్యలోని లక్ష్మీ లేఅవుట్‌లో చోటుచేసుకుంది.
షాలిని (26) అనే మహిళ ఆమె నివాసం ఉంటున్న నాలుగో అంతస్తు మీద నుంచి కింద పడి మృతి చెందింది.
నాలుగో అంతస్తు నుంచి దూకిన
షాలినికి సురేశ్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహం చేసుకున్న తరువాత సురేశ్, షాలిని దంపతులు చాలా సంతోషంగా జీవించారు, షాలిని, సురేష్ దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న ఓ పాప ఉంది. పాపతో కలిసి షాలిని సంతోషంగా ఉండేది.

లక్ష్మీలేఅవుట్‌లోని ఇంట్లో సురేష్, షాలిని దంపతుల బిడ్డతోపాటు సురేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది. ఇదే నెల 14వ తేదీ రాత్రి పాపకు పాలు తాగించే విషయంలో షాలిని మీద ఆమె భర్తతో పాటు అత్తమామలు మండిపడ్డారని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన షాలిని ఇంట్లోని నాలుగో అంతస్తులోకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేశారు. రాత్రి పాప ఏడుస్తున్నప్పటికీ షాలిని మాత్రం పాలు తాగించలేదని తెలిసింది. దీంతో సురేష్ అతని భార్య షాలినిని తిట్టాడు. ఈ సందర్భంలో అత్త వచ్చి బిడ్డను ఇవ్వాలని షాలిని కోరారు. అయితే బిడ్డను ఇవ్వడానికి షాలిని నిరాకరించింది. ఆ సందర్బంలో సురేష్ తన బిడ్డను మా అమ్మ దగ్గరకు ఇచ్చేయాలని అతని భార్య షాలినికి చెప్పాడు.

దీంతో మనస్తాపం చెందిన షాలిని భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన షాలినిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న షాలిని చికిత్స అందక శుక్రవారం మృతి చెందిందని పోలీసులు అన్నారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగా షాలిని ఆత్మహత్య చేసుకుందని షాలిని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఈ ఘటనపై బేగూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications