అపార్ట్ మెంట్ 10వ అంతస్తు నుంచి దూకి మహిళ మృతి, ఫ్లాట్ లో భర్త ఉంటే !
బెంగళూరు/లక్నో: బాగా చదువుకున్న ఓ యువతి బెంగళూరు చేరుకుని మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. భర్తతో కలిసి ఆమె ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో నివాసం ఉంటున్నది. ప్రతిరోజు ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీకి వెళ్లి విధులు నిర్వహించి ఇంటికి వస్తోంది. నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని బాల్కనీ మీద నుంచి యువతి కిందపడి చనిపోయింది.
ఐటీ హబ్ బెంగళూరు సిటీలో దేశంలోని వివిద రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వాళ్లు, కోట్లలో వ్యాపారాలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు బెంగళూరులో సొంతంగా ఇండ్లు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ లు సొంతంగా తీసుకుని నివాసం ఉంటున్నారు.

బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ పై నుంచి పడి ఓ వివాహిత మహిళ మృతి చెందిన ఘటన యలహంక సమీపంలోని నాగేనహళ్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అమృతా శర్మ (27) అనే మహిళ మృతి చెందిందని పోలీసులు చెప్పారు. బెంగళూరు సిటీలోని ప్రముఖ కంపెనీలో అమృతా శర్మ ఉద్యోగం చేస్తున్నది.
యలహంకలోని అపార్ట్ మెంట్ నుంచి ప్రతిరోజు అమృతా శర్మ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. ఉదయం ఉద్యోగానికి వెళ్లిన అమృతా శర్మ సాయంత్రం ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు చేరుకుంది. కుటుంబ సమేతంగా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న అమృతా శర్మ రాత్రి పది గంటల సమయంలో ఆమె నివాసం ఉండే ఫ్లాట్ లోని వంటగదికి అనుబంధంగా ఉన్న పదో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడింది.
ఆ సమయంలో అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు. సెక్యూరిటీ గార్డులు అమృతా శర్మను ఆస్పత్రికి తరలించారు. చికిత్స విఫలమై అమృతా శర్మ మృతి చెందిందని పోలీసులు అన్నారు. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. మహిళకు రెండేళ్ల క్రితం వివాహమై ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఆ అమృతా శర్మ ఆమె తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ప్రస్తుతం లక్నో నుంచి వస్తున్నారని, కేసు విచారణలో ఉందని యలహంక న్యూటౌన్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications