లేడీ లీడర్ అంటూ 8 మందితో పెళ్లి, రూ 38 కోట్లు వసూలు చేసిన కిలాడీ లేడి
జేడీఎస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ ఓ ఖతర్నాక్ లేడీ ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని కోట్లకు పడగలెత్తిన ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో చోటుచేసుకుంది.
తబుసుమ్ తాజ్ అలియాస్ తబుసమ్ అలియాస్ తాజ్ (40) అనే మహిళ అరెస్టు అయ్యింది. తబుసమ్ తాజ్ అనే నిందితురాలు చేసిన మోసాలు గురించి తెలుసుకున్న పోలీసులు, ప్రజలు షాక్ అయ్యారు.
కర్ణాటకలోని ఉడిపికి చెందిన తబుసమ్ తాజ్ ఒకరిని కాదు, ఇద్దరిని కాదు ఏకంగా 8 మందికి మాయమాటలు చెప్పి వారిని పెళ్లి చేసుకుంది. లోన్ ఇస్తానని నమ్మించి సుమారు రూ. 38 కోట్లు వసూలు చేసిన తబుసమ్ తాజ్ అనేక మందిని మోసం చేసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని
తుమకూరు, భద్రావతి, శివమొగ్గ, మంగళూరు, ఉడిపి, మణిపాల్, కాపు, విజయనగరం జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లతో పాటు హడగళి, హోస్పేట్, థానే రూరల్‌లో పోలీస్ స్టేషన్లలో ఖతర్నాక్ లేడీ తుబసుమ్ తాజ్ మీద కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.

సిటిజన్ లేబర్ వెల్ఫేర్ అండ్ యాంటీ కరప్షన్ కమిటీ అనే పేరుతో తబుసమ్ తాజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీని అడ్రస్ ను ఇమేజ్ ముస్కాన్ బిల్డింగ్, రెసిడెంట్ హోటల్, సర్వీస్ బస్టాండ్, ఉడిపి, కర్ణాటక అని నమోదు చేసింది. అదేవిధంగా తాను జేడీఎస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర మైనారిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అని తబుసమ్ తాజ్ అనేక మందిని నమ్మించింది. దీంతో పాటు తబుసమ్ తాజ్ హీనా ఎంటర్‌ప్రైజెస్‌గా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభించింది.
ముద్రా రుణం, ప్రభుత్వ ఉద్యోగం, మైనారిటీ రుణం, విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఇప్పిస్తామని నిందితురాలు తబుసమ్ తాజ్ అనేక మందిని మోసం చేసింది కర్ణాటక స్పీకర్
యూటీ ఖాదర్ వద్ద బ్లాక్ మనీ ఉందని, దానిని వైట్ మనీగా చెయ్యడానికి తాను ఇలాంటి కార్యాలయం ఏర్పాటు చేశానని, తనకు జేడీఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని మైనార్టీ నాయకులు చాలా మంది తెలుసు అని అనేక మందిని నమ్మించింది.
బ్లాక్ మనీని వైట్ మనీ చెయ్యడానికే తాను ఈ వ్యాపారం ప్రారంభించానని తబుసమ్ తాజ్ అమాయకులను నమ్మించింది. కోటి రూపాయల రుణం కావాలంటే ముందుగా రూ 15 లక్షలు ఇస్తే మీకు సబ్సిడీలో 10 రోజుల్లో మైనార్టీ రుణం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసింది. అనేక మందిని అదేవిధంగా మాయమాటలు చెప్పిన తబుసమ్ తాజ్ దాదాపు 38 కోట్ల రూపాయలు వసూలు చేసి వారిని మోసం చేసింది. అనేక మంది యువకులకు మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు 8 మందిని పెళ్లి చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తబుసమ్ తాజ్ మోసాల గురించి క్షుణ్ణంగా ఆరా తీస్తున్నామని కర్ణాటక పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications