ప్రియుడితో కారులో అడ్డంగా దొరికిన భార్య..పోకిరి లేవల్ ట్విస్ట్ ఇచ్చిన భర్త..!
వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని తమ భర్తలను ప్రియుడితో కలిసి భార్యలు హత్య చేసిన ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్నాయి.కట్టుకున్న భర్తను, పుట్టిన బిడ్డలను కాదనుకుని కొందరు మహిళలు వివాహేతర సంబంధం పాల్పడుతున్నారు. వివాహేతర సంబంధాల వల్ల జరిగే అనర్థాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి.తాజాగా ఓ వివాహిత వివాహేతర సంబంధం బయటపడింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆమె భర్త వారిని అడ్డగించాడు.
Wife got #caught with someone else.
— ShoneeKapoor (@ShoneeKapoor) May 21, 2025
Got instant judgment on the spot. pic.twitter.com/yxkMInfveQ
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్రహంతో ఊగిపోయే భర్తలను చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ భర్త ఒక్క మాట కూడా మాట్లాడకుండా, తన భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని నీళ్లతో కడిగి తొలగించాడు. ఆ తర్వాత, ఇంకా పెద్ద షాకిస్తూ, ఆమె ప్రియుడి చేత మళ్లీ తన భార్య నుదుటిపై సింధూరాన్ని దిద్దించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, మహిళ నుదుటిపై సింధూరం పెడితే పెళ్లయినట్లుగా భావిస్తారు. అయితే, ఈ తతంగం అంతా జరుగుతుండగా, ఆ మహిళ ప్రియుడితో పెళ్లికి ఇష్టం లేనట్లుగా వ్యవహరించడం గమనార్హం.

భార్యను ప్రియుడితో కారులో పట్టుకున్న భర్త చేసిన పనికి నెటిజన్లు షర్షం వ్యక్తం చేస్తున్నారు.భర్త చేసిన పనిని చాలా మంది సమర్థించారు. ప్రియుడు ఆమె కలిసి ప్లాన్ చేసి మొగుడిని చంపే కంటే ముందే మేల్కొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. చాలా మంచి పని చేశావ్ అయ్యా" అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్‌గా నిలిచింది. పెళ్లి చేసి ఆమె భర్త మంచి పని చేసి దరిద్రాన్ని వదిలించుకున్నాడని మరో నెటిజన్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. ఆమెతో డైవర్స్ తీసుకుని శుభ్రంగా ఇంకో పెళ్లి చేసుకో అంటూ ఆ భర్తకు నెటిజన్లు సలహాలు కూడా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications