Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యువకులతో లింక్, జల్సాలు, భర్త పెట్రోల్ బంక్ యజమాని, కిడ్నాప్ చేయించి భార్య నాటకాలు!

బెంగళూరు: విలాసవంతమైన జీవితానికి, యువకులతో తిరగడానికి డబ్బులు అవసరమై కట్టుకున్న భర్తను అతని భార్య ఆరు మంది యువకులతో కలిసి కిడ్నాప్ చేయించింది. నగదు లాక్కోవడానికి భర్త కుటుంబ సభ్యులతో డీల్ జరుగుతున్న సమయంలో పోలీసులు ఆరా తీశారు. సొంత భార్య వ్యాపారవేత్తను కిడ్నాప్ చేయించిందని వెలుగు చూడటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. భర్తను కిడ్నాప్ చేయించిన కేసులో భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని కర్ణాటకలోని దావణగెరె పోలీసులు తెలిపారు.

దంపతుల హ్యాపీ లైఫ్

దంపతుల హ్యాపీ లైఫ్

కర్ఱాటకలోని దావణగెరె తాలుకా లోకికెరె గ్రామంలో శ్రీనివాస్, సంగీత దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం అయిన తరువాత సంగీత భర్త శ్రీనివాస్ తో కలిసి మొదట సక్రమంగానే కాపురం చేసింది. అయితే డబ్బు ఆశతో సంగీత రానురాను భర్త శ్రీనివాస్ తో గొడవలు పడుతూ వస్తోంది.

భర్తకు సొంతంగా పెట్రోల్ బంకు

భర్తకు సొంతంగా పెట్రోల్ బంకు

శ్రీనివాస్ కు సొంతంగా పెట్రోల్ బంకు ఉంది. పెట్రోల్ బంకు వ్యాపారంతో పాటు శ్రీనివాస్ వ్యవసాయం చేయిస్తున్నాడు. శ్రీనివాస్ కు ఎక్కువ పొలం ఉండటంతో వ్యవసాయం భాగా చేయిస్తున్నాడు. శ్రీనివాస్ నిత్యం ఎక్కువ డబ్బు సంపాధించినా తన చేతికి మాత్రం ఇవ్వడం లేదని సంగీత భర్తతో గొడవలు పడుతుండేది.

భార్య అడ్డదార్లు

భార్య అడ్డదార్లు

భర్త సంగీత ఎప్పుడూ నగదు కోసం తనతో ప్రేమతో ఉన్నట్లు నటిస్తోందని, నిజంగా నేను అంటే ఇష్టం లేదని శ్రీనివాస్ కు తెలిసింది. చేతికి డబ్బులు అందిన తరువాత సంగీత విలాసవంతంగా గడపడానికి స్నేహితులతో ఎక్కువగా బయటతిరిగేది. భర్త శ్రీనివాస్ ఏమైనా ప్రశ్నిస్తే నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతానని, అడగడానికి నువ్వు ఎవరు అని భర్త శ్రీనివాస్ తో సంగీత గొడవపడేది.

తన్ని తరిమేసిన భర్త

తన్ని తరిమేసిన భర్త

నిత్యం గొడవలు ఎక్కువ కావడం, భార్య సంగీత చెప్పిన మాట వినకపోవడంతో శ్రీనివాస్ కు చిర్రెత్తింది. రెండు సంవత్సరాల క్రితం పెద్దలు పంచాయితీ చేసినా సంగీతలో ఎలాంటి మార్పురాలేదు. ఇక లాభం లేదని తెలుసుకున్న శ్రీనివాస్ రెండు సంవత్సరాల క్రితం సంగీతను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. అప్పటి నుంచి శ్రీనివాస్, సంగీత వేరువేరుగా కాపురం ఉంటున్నారు.

ఎస్ఐతో గొడవ పడి విషం తాగింది

ఎస్ఐతో గొడవ పడి విషం తాగింది

ఇటీవల ఓ చిన్న విషయంలో స్థానిక సబ్ ఇన్స్ పెక్టర్ తో గొడవ పడిన సంగీత తరువాత విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. తరువాత ఎస్ఐ తనతో గొడవపడి బలవంతంగా విషం తాగించాడని సంగీత కేసు పెట్టడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. భర్త శ్రీనివాస్ దూరంగా ఉండటంతో నిత్యం ఖర్చుల కోసం డబ్బులు అవసరం కావడం, భర్త దగ్గరకు రానివ్వకపోవడంతో సంగీతకు పిచ్చిపట్టినట్లు అయ్యింది.

యువకులతో లింక్

యువకులతో లింక్

భర్త దూరం అయితన తరువాత కొందరు యువకులతో సంగీత పరిచయం పెంచుకుంది. తన భర్త శ్రీనివాస్ ను కిడ్నాప్ చేస్తే వచ్చే డబ్బులో మనం అందరం కలిసి పంచుకుందామని సంగీత యువకులకు మాయమాటలు చెప్పింది. పెట్రోల్ బంకులో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన శ్రీనివాస్ ను ఆరు మంది యువకులతో కలిసి భార్య సంగీత కిడ్నాప్ చేయించింది.

కిడ్నాప్ నాటకం రివర్స్

కిడ్నాప్ నాటకం రివర్స్

తన భర్త శ్రీనివాస్ ను ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బులు ఇవ్వాలని తనకు ఫోన్లు చేస్తున్నారని సంగీత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన నిందితులు అతనికి దూరంగా ఉంటున్న సంగీతకు ఎందుకు ఫోన్ చేశారు ? అసలు ఏమి జరిగింది అంటూ పోలీసులు వివరాలు సేకరించారు. సంగీత మీద అనుమానం రావడంతో ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ కాల్ డేటాను సేకరించిన పోలీసులు కూపీలాగారు. అంతే ఆరు మంది యువకులతో కలిసి సంగీతనే శ్రీనివాస్ ను కిడ్నాప్ చేయించిందని పోలీసులు వివరాలు సేకరించారు. సంగీత, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి బెండ్ తీసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన శ్రీనివాస్ ను క్షేమంగా రక్షించారు. కిడ్నాప్ కేసులో మరో నలుగురు నిందితులు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+