కోడి గుడ్లు తెచ్చిన తంటా... రోజు గుడ్లు తేవడం లేదని ప్రియుడితో పారిపోయిన భార్య...!
ఇష్టం లేని కాపురాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కలిసి కాపురం చేయలేని పరిస్థితి సమాజంలో కొనసాగుతోంది. పెళ్లైనా ఇంకోకరితో సంబంధం పెట్టుకుని దాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడతారు. దీంతో కుటుంబాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా దాన్ని కారణంగా చూపి తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ నేపథ్యంలోనే ఓ భార్య పెళ్లయిన ఆరు నెలలకు తన ప్రియుడితో పారిపోయింది. కాని ఆమే చెబుతున్న రీజన్ చూస్తే మాత్రం చాల సిల్లిగా కనిపిస్తోంది.
తన భర్త రోజు తనకు కావాల్సిన కోడిగుడ్లు తెచ్చి ఇవ్వడం లేదని చెబుతోంది. తనకు రోజు గుండ్లు తినే అలవాటు ఉందని అందుకే ఆయనతో కాపురం చేయలేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే భర్తతో గుండ్లకోసం ప్రతి రోజు ఘర్షణపడేది. దీంతో ఈ శనివారం కూడ భర్తతో గొడవపడి ఆయన ఇంట్లో లేని సమయంలో బయటకు వెళ్లిపోయింది. అది కూడ తన ప్రియుడితో పారిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా, కంపేర్‌గంజ్ లో జరిగింది.

కాగా ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన యువతి భర్త మాత్రం తాను ఓ దినసరి కూలీ అని, తన ఆదాయంతో భార్యకు రోజు గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదని చెప్పాడు. అయితే తన ఆర్ధిక పరిస్థితి ఆసరాగా తీసుకున్న భార్య రోజు గుడ్లు తెచ్చిపెట్టమని ఘర్షణకు దిగేదని అన్నాడు. మరోవైపు తన ప్రియుడు ఆమేకు రోజు గుడ్లు తెచ్చి పెట్టేవాడని దీంతో అతడితో పారి పోయి ఉంటుందని తెలిపాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications