Lady: నిర్లక్షం చేస్తే తగినమూల్యం చెల్లించకతప్పదు, చీరతో పాటు మహిళ కాలు కూడా ?
బెంగళూరు/చిక్కమగళూరు: మహిళలు బైక్ నడిపేటప్పుడు, బైక్ లో వెనుక కుర్చుని వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చుడీదార్ వేల్ వేసుకుని, చీర కట్టుకుని బైక్ లో వెలుతుతన్నప్పుడు బైక్ వెనుక చక్రానికి బట్టలు తగలకుండా ముందుగానే జాగ్రత్తపడా. లేదంటే లేనిపోని సమస్యలు ఎదురౌతాయి. చీర కట్టుకుని బైక్‌పై వెళ్తున్న మహిళ చీరతో పాటు కాలు కూడా వెనుక చక్రంలో ఇరుక్కుపోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె పట్టణంలో చోటుచేసుకుంది.
బైక్ వెనుక కూర్చున్న మహిళ చీర, ప్లీట్‌లు బైక్ చక్రానికి తగిలి కాలు కూడా బైక్ చక్రంలో ఇరుక్కోవడంతో మహిళ సుమారు గంటపాటు అష్టకష్టాలు పడి నరకం అనుభవించింది. చిక్కమగళూరు జిల్లాలోని తరికెరె పట్టణం సమీపంలోని బ్రిక్ గ్రామానికి చెందిన యశోదా బాయి అనే మహిళ బైక్‌పై తరికెరె పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బైక్ లో వెనుక కూర్చున్న యశోదా బాయి చీర బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. కొంతదూరం ప్రయాణించిన తరువాత ఆమె చీరతో పాటు ఆమె పాదం కూడా వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. వెంటనే యశోదాబాయితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడిపోయారు. బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే పేకిలేచి కిందపడిపోయి కేకలు వేస్తున్న యశోదా బాయిని లేపేందుకు ప్రయత్నించాడు.
బైక్ లోని వెనుక చక్రంలె యశోదా బాయి పాదం వెనుక చక్రం లోపల ఇరుక్కుపోయింది. సుమారు గంటపాటు మహిళ కాలు తీసేందుకు ప్రయత్నించారు. చివరికి మెకానిక్ వచ్చి బైక్ చైన్ కట్ చేసి గేర్ బాక్స్ విప్పి మహిళ కాలును బయటకు తీశారు. ఈ ఘటనలో యశోదా కాలికి తీవ్రగాయాలు కావడంతో ఆమెను చిక్కమగళూరు ఆసుపత్రికి తరలించారు. యశోదా చీర కొంగు చక్రంలో చిక్కుకుపోయిన తరువాత ఆ విషయం గమనించకుండా బైక్ వేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. బైక్ నడిపేటప్పుడు, బైక్ లో వెనుక మహిళలు ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు మనవి చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications