మెడలో పాముతో డ్యాన్స్ చేసిన మహిళా పూజారి, పాలాభిషేకం, వీడియో వైరల్, నేను భద్రకాళి, జైల్లో!

చెన్నై/వాలాజాబాద్: ఆలయం కేంద్రంగా జోస్యం చెబుతూ కాలం గడుపుతున్న మహిళా పూజారి ఆ ప్రాంతంతో పాటు తనకు పేరుప్రతిష్టలు రావాలని పక్కాప్లాన్ తో మెడలో పామును వేసుకుని నాట్యం చెయ్యడంతో కటకటాలపాలైయ్యింది. ఆలయంలో జోస్యం చెబుతున్న మహిళా పూజారి తన మెడలో పాముతో నాట్యం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో అటవి శాక అధికారులు వెతుక్కుంటూ వెళ్లి ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన తమిళనాడులో జరిగింది. పేరుప్రతిష్టలు రావడం పక్కనపెడితో ఆ మహిళకు సినిమా కష్టాలు ఎదురైనాయి.

మహిళా పూజారి హవా

మహిళా పూజారి హవా

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని వాలాజాబాద్ అవెల్లేరిలోని అమ్మా ఆలయం వీధికి చెందిన కపిల అలియాస్ కబిల (38) అనే మహిళ భద్రకాళి అమ్మాన్ ఆలయం నిర్వహిస్తోంది. ఇదే ఆలయం ఆవరణంలో చాలకాలం నుంచి కబిల వేలాది మందికి జోస్యం చెబుతూ కాలం గడుపుతోంది. కబిల దగ్గర జోస్యం చెప్పించుకోవడానికి అనేక ప్రాంతాల నుంచి అమ్మావారి భక్తులు అక్కడికి వెలుతుంటారు.

కుంభాభిషేకం రోజు పాముతో కబిల డ్యాన్స్

కుంభాభిషేకం రోజు పాముతో కబిల డ్యాన్స్

ఏడాదిన్న క్రితం భక్తకాళి అమ్మాన్ ఆలయంలో కుంభాభిషేకం జరిగింది. ఆ సమయంలో మెడలో పామును వేసుకున్న కబిల నాట్యం చేస్తూ అమ్మవారికి పాలాభిషేకం చేశారు. తాను అమ్మవారి స్వరూపాన్నేనని, మీ కష్టాలు తీర్చడానికి ఈ అవతారంలో ఉన్నానని, మీకు ఇక ముందు అంతా మంచే జరిగేలా తాను చూసుకుంటానని అక్కడికి వచ్చిన భక్తులకు కబిల హామీలు ఇచ్చింది.

కబిల పాము డ్యాన్స్ వైరల్

కబిల పాము డ్యాన్స్ వైరల్

కబిల మెడలో పాము వేసుకుని నాట్యం చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది. మెడలో పాముతో కబిల డ్యాన్స్ చేస్తూ అమ్మావారికి పాలాభిషేకం చేస్తున్న వీడియో చూసిన భక్తులు భద్రకాళి అమ్మాన్ దేవాలయం ముందు క్యూ కట్టారు. దేవాలయంతో పాటు కబిల పేరు మార్మోగిపోవడంతో భక్తులు పోటెత్తారు. కబిల పాము డ్యాన్స్ చూసిన భక్తులు భక్తి పారవశ్యం చెందారు.

వీడియో చూసిన పాండురంగన్

వీడియో చూసిన పాండురంగన్

మెడలో పామును వేసుకుని కబిల డ్యాన్స్ చేస్తున్న వీడియో చెంగల్పట్టు జిల్లా అటవి శాఖ అధికారి పాండురంగన్ చూశారు. పాండురంగన్ తో పాటు అటవి శాఖ అధికారులు వాలాజాబాద్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గరకు చేరుకుని అక్కడ జోస్యం చెబుతున్న కబిలను విచారణ చేశారు.

దెబ్బకు జైల్లో మహిళా పూజారి కబిల

దెబ్బకు జైల్లో మహిళా పూజారి కబిల

పామును ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు, ఎక్కడ దాచి పెట్టారు, మెడలో పామును వేసుకుని ఎందుకు నాట్యం చేశారు అంటూ అటవి శాఖ అధికారి పాండురంగన్ కబిలకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమయంలో కబిల పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆమెను అటవి శాఖ అధికారులు అరెస్టు చేశారు. కబిలను న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెను జైలుకు పంపించారు. మొత్తం మీద పామును మెడలో వేసుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కబిల జైలుకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+