పార్టీకి వచ్చి, స్నేహితుడి భార్యపై అఘాయిత్యం...! అనంతరం స్నేహితుడి హత్య

మద్యం మత్తులో ఎవరు ఎం చేస్తారో అర్థం కాని పరిస్థితి. తాగిన మైకంలో తమ మనసులో ఉన్న కోరికలును తీర్చుకోవడంతో పాటు విచక్షణ రహితంగా ఇతరులను కడతేర్చడం లాంటి సంఘటనలు కోకొల్లలు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగి మహిళలు అత్యాచారానికి గురైన సంధర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఇద్దరు మిత్రులు మద్యం సేవించి స్నేహితుడి భార్యనే చెరపట్టారు.

దాన్ని అడ్డుకోబోయిన ఆమే భర్త అయిన స్నేహితుడిపై కూడ దాడి చేశారు. దాడిలో అప్పటివరకు తమతో మద్యం సేవించిన స్నేహితుడు చనిపోయాడు. దీంతో రేప్‌కు గురైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కుట్రపూరితంగా జరిగిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A woman was allegedly raped while her husband was killed

మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు చెప్పిన వివరాలను బట్టి.. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు పార్టీ చేసుకునేందుకు వచ్చి ఇంట్లో ఉన్న స్నేహితుడి భార్యపై కన్నేసి ఆమేపై అత్యాచారం చేసి, అనంతరం స్నేహితుడిని హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే గత సోమవారం సునిల్ కుష్వాహా మరియు మనోజో అహిర్వార్ అనే ఇద్దరు అత్యాచారానికి గురైన బాధితురాలికి ఇంటికి వచ్చారు.

ఆ ఇద్దరితో పాటు ఆమే భర్త కలిసి మద్యం సేవించారని , అనంతరం సునిల్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని అయితే అది గమనించిన ఆమే భర్త దాన్ని అడ్డుకోబోయాడని తెలిపింది. దీంతో పక్కనే మనోజ్ మహిళ భర్తను అడ్డుకుని మద్యం మత్తులో దాడి చేసి భర్తను హత్య చేశాడని, అనంతరం మహిళపై దాడి చేసి వెళ్లిపోయారని ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+