డిప్యూటీ సీఎం భార్య ఫేస్‌బుక్ వాల్‌పై బూతులు: 50 ఏళ్ల మహిళలను లోపలేశారు..!!
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ఓ 50 సంవత్సరాల మహిళ ఇప్పుడు జైలుపాలయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అమృత ఫడ్నవీస్‌పై కామెంట్స్‌ను పోస్ట్ చేయడానికి నిందితురాలు ఏకంగా 53 ఫేస్‌బుక్ ఫేక్ ఐడీలను సృష్టించినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు సంవత్సరాలుగా ఆమె అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్నట్లు గుర్తించారు.

53 ఫేక్ ఐడీలతో..
నిందితురాలి పేరు స్మృతి శేఖర్ పాంచాల్. థానె భయాందర్‌పాడా ప్రాంతంలో నివాసం ఉంటోన్నారు. అమృత ఫడ్నవీస్‌పై వ్యక్తిగతంగా దాడులు చేయడానికి 53 ఫేస్‌బుక్ ఫేక్ ఐడీలను సృష్టించారు. అమృత ఫడ్నవీస్ ఫేస్‌బుక్ వాల్‌పై గణేష్ కపూర్ పేరుతో ఎక్కువగా పోస్టింగ్స్ అయినట్లు తేల్చారు.

అమృత ఫడ్నవీస్‌పై
అమృత ఫడ్నవీస్ ఫేస్‌బుక్ వాల్‌పై తరచూ అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తోండటాన్ని గమనించిన భారతీయ జనత పార్టీ యువమోర్చా నాయకురాలు పల్లవి సప్రె..ఈ నెల 7వ తేదీన ముంబై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. కొన్ని స్క్రీన్ షాట్లు, పొటోలను తన ఫిర్యాదుకు జత చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పలు సెక్షన్ల కింద..
ఫేస్‌బుక్‌పై చేస్తోన్న కామెంట్స్ ఎక్కడి నుంచి పోస్ట్ అవుతున్నాయనేది గుర్తించారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితురాలిని గుర్తించారు. భయాందర్‌పాడాలో నివసిస్తున్నట్లు నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్‌లోని 419, 468తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద కేసు నమోదు చేశారు. స్మృతి పాంచాల్ మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. భయాందర్‌పాడాలోని నివాసంలో స్మృతి పాంచాల్‌ను అరెస్ట్ చేశారు.

కొత్త కొత్త పేర్లతో..
తొలుత తన సొంత పేరు మీద స్మృతి పాంచాల్.. అమృత ఫడ్నవీస్‌పై ఘాటు వ్యాఖ్యల చేశారని, అసభ్యకరమైన సమాచారాన్ని పోస్ట్ చేశారని స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ యశస్వి యాదవ్ చెప్పారు. ఈ అకౌంట్‌ను రద్దు చేయాలంటూ 2021 నవంబర్‌లో అధికారులు ఫేస్‌బుక్ యాజమాన్యానికి సూచించారు. అధికారికంగా లేఖలు సైతం రాయడంతో ఆ అకౌంట్ రద్దయింది. దీనితో ఆమె గణేష్ కపూర్ పేరుతో మరో ఫేక్ అకౌంట్‌ను సృష్టించుకున్నారని అన్నారు.

గణేష్ కపూర్‌గా..
ఇలా 53 నకిలీ ఖాతాల ద్వారా అమృత ఫడ్నవీస్‌పై వ్యాఖ్యలు చేసేవారని వివరించారు. అందులో గణేష్ కపూర్ అకౌంట్‌ను ఆమె స్వయంగా నిర్వహిస్తోన్నారి, దీని ద్వారానే నిందితురాలు తమ చేతికి చిక్కినట్లు చెప్పారు. ఆ తరువాత కూడా 53 ఫేక్ ఐడీలతో అమృత ఫడ్నవీస్‌పై వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications