ముగ్గురు మొనగాళ్లు కాదు ముగ్గురు మొగుళ్లు, రైల్వేస్టేషన్ లోనే చంపేశారు !
చెన్నై: రైల్వేస్టేషన్ లోనే మహిళను దారుణంగా హత్య చేశారు. చెన్నైలోని మీనంబాక్కం ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన రాజీ అలియాస్ రాజేశ్వరి (34) అనే మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులు దర్జాగా వెళ్లిపోయారు. రాజేశ్వరి రైలులో సమోసాలు, పండ్లు అమ్ముతున్నదని పోలీసులు అన్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఎగ్మూరు నుంచి గిండీ వెళ్తున్న రైలులో రాజేశ్వరి పండ్లు, సమోసాలు విక్రయిస్తోంది.
బుధవారం రాత్రి 8.30 గంటలకు సైతపెట్టై రైల్వే స్టేషన్‌లో ఎలక్ట్రిక్ రైలు ఆగింది. ఆ సమయంలో రాజేశ్వరి ప్లాట్‌ఫాంపై సమోసాలు, పండ్లు, మిఠాయిలు విక్రయిస్తోంది. ఆ తర్వాత హఠాత్తుగా రైలు నుంచి దిగిన నలుగురు వ్యక్తులు తమ చేతిలో ఉన్న కత్తులు, కొడవళ్లతో రాజేశ్వరిని నరికి పారిపోయారు. రాజేశ్వరి తల, మెడపై నరికడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను రైల్వే పోలీసులు రక్షించి సైదాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మూడో భర్త హత్యకు గురైన తరువాత రాజేశ్వరి ఆమె రెండో భర్తతో కలిసి జీవిస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమ సంబంధమే రాజేశ్వరి హత్యకు దారితీసిందా ? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో మాంగంబాక్కం రైల్వే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2016లో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి అనే యువతిని నరికి చంపేశారు. ఇప్పుడు అదే రైల్వేస్టేషన్ లో రాజేశ్వరి దారుణ హత్యకు గురైయ్యింది.












Click it and Unblock the Notifications