'వదిన ఫోటోలతో మరిది చేసిన బాగోతం..'

Subscribe to Oneindia Telugu

ముంబై : ట్రెండ్ కు తగ్గ ఫ్యాషన్స్ ను ఫాలో అవడానికి కొందరు ఇష్టపడితే.. ఫక్తు ఆచార సాంప్రదాయల పరిధిలోనే ఆహార్యం కూడా ఉండాలన్న తీరులో మరికొందరు వ్యవహరిస్తారు. ఇందులో మొదటి కోవకు చెందిన ఓ వదినకు.. రెండో కోవకు చెందిన ఓ మరిదికి మధ్య పడింది పేచీ. వదిన మోడరన్ గా ఉండడం నచ్చని సదరు మరిది గారు ఆమె ఫేస్ బుక్ ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారేలా చేశాడు.

సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు సంచలనంగా మారడంతో కంగు తిన్న సదరు వదిన పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయంపై ఆరా తీసిన పోలీసులకు అసలు నిందితుడు ఆమె మరిదే అని తేలడంతో షాక్ తగిలినంత పనైంది.

A woman was complainted her hubbys brother for morphing fb photos

ఇంతకీ అసలు విషయమేంటంటే.. ముంబైకి చెందిన ఓ ఉద్యోగస్తురాలికి 2014లో వివాహమైంది. ఆమె భర్త గల్ఫ్ లో ఉద్యోగం చేస్తుండగా.. కేరళలో ఉన్న అత్తమామల వద్దకు అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటుంది. ఇదే క్రమంలో తన భర్తకు బాబాయ్ కొడుకైన ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి ఆమె డ్రెస్సింగ్ ను చూసి ద్వేషం పెంచుకున్నాడు. ఆమె మోడరన్ గా ఉండడం.. ఆ ఫోటొలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఏమాత్రం జీర్ణించుకోని అతడు ఎలాగైనా ఆమెపై కక్ష సాధించాలనుకున్నాడు.

ముందుగా ఫేస్ బుక్ ద్వారా ముందుగా ఆమె ఫ్రెండ్ లిస్టులో చేరిన ఉన్నికృష్ణన్.. ఆమె ఫోటోలను ఫేస్ బుక్ నుంచి సేకరించి, ఎడిట్ చేసి ఆమె ఫ్రెండ్స్ అందరికీ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. స్నేహితులంతా ఆమెకు విషయం గురించి చెప్పడంతో.. పోలీసులను ఆశ్రయించన ఆమెకు మరిది ఉన్నికృష్ణన్ నే ఈ పని చేశాడని తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman was complainted her hubbys brother for morphing fb photos. The accused person was taken her photos from facebook and send them to their friends

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X