చిన్న వయస్సులో పెళ్లి వద్దు: ప్రేమికుల ఆత్మహత్య

బెంగళూరు: చిన్న వయస్సులో పెళ్లి వద్దని పెద్దలు చెప్పడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రేమికులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ఒకే రోజు ప్రాణాలు వదిలారు.

బెంగళూరు నగరంలోని మరియప్పన పాళ్యలో నివాసం ఉంటున్న సోనియా (19), ఆంధ్రా హళ్ళిలో నివాసం ఉంటున్న భరత్ (21) చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. భరత్ ఇంటర్ లో చదువుకు స్వస్తి చెప్పాడు.

సోనియా డిప్లోమా పూర్తి చేసింది. రెండు వారాల క్రితం సోనియా ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివాసం ఉండటం, కలిసి చదువు కోవడంతో ప్రేమలో పడ్డారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు.

A young couple committed suicide in Bengaluru

అయితే ఇంత చిన్న వయస్సులో పెళ్లి వద్దని, తరువాత మేమే పెళ్లి జరిపిస్తామని కుటుంబ సభ్యులు ఇద్దరికి నచ్చచెప్పారు. అయితే పెద్దలు తమ పెళ్లి చెయ్యరని వీరు అనుకున్నారు. ఈనెల 6వ తేది ఉదయం 11.30 గంటలకు రాజాజీనగర్ లోని డాక్టర్ రాజ్ కుమార్ రోడ్డు లోకి వెళ్లారు.

తరువాత రాఘవేంద్ర స్వామి దేవాలయం సమీపంలో ఇద్దరూ విషం సేవించారు. కుటుంబ సభ్యులకు పోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పారు. సోనియా, భరత్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని సమీపంలోని సుగుణ ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన చికిత్స కోసం సోనియాను సంజీవిని ఆసుపత్రికి, భరత్ ను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గురువారం ఇద్దరూ ప్రాణాలు వదిలారు. సోనియా, భరత్ చెప్పిన మాట వినలేదని, ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+