వగలాడితో అక్రమ సంబంధం, ఇద్దరికి పిల్లలు, క్లైమాక్స్ లో పీరాసాబ్ ఏం చేశాడంటే?

బెంగళూరు/కోప్పళ: యువకుడికి వివాహం అయ్యింది. మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళకు పెళ్లి అయ్యింది. ఇద్దరూ ఒకే గ్రామంలో నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేస్తోంది. వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో కాపురంచేస్తున్నాడు. అయితే ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది.

కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కుష్టగి తాలుకాలోని మాలగిత్తి గ్రామంలో పీరాసాబ్ సధాఫ్ అలియాస్ సధాఫ్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామంలో శారదా అనే మహిళ నివాం ఉంటున్నది. పీరాసాబ్ కు కొన్ని సంవత్సరాల క్రితమే వేరే మహిళతో వివాహం అయ్యింది. పీరాసాబ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 love-affair-

ఇక శారదాకు కూడా వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. శారదాకు ఓ కుమార్తె ఉంది. ఒకే గ్రామంలో నివాసం ఉంటున్న శారదా, పీరాసాబ్ మతాలు వేరు అయినా ప్రేమలో పడ్డారు. వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకుని కాపురాలు చేస్తున్న పీరాసాబ్, శారదా గుడ్డిగా ప్రేమలో పడి కామంతో ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

అక్రమ సంబంధం పెట్టుకున్న శారదా, ఆమె ప్రియుడు పీరాసాబ్ ఎప్పుడంటే అప్పు గ్రామం నుంచి బయటకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం శారదా ఆమె భర్తకు మాయమాటలు చెప్పి ప్రియుడు పీరాసాబ్ తో కలిసి వారం రోజుల పాటు విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేసిందని వెలుగు చూసింది.

ఈ విషయం తెలుసుకున్న పీరాసాబ్ భార్య నేరుగా శారదా ఇంటికి వెళ్లి నా భర్తను వదిలేయాలని కాళ్లుపట్టుకుందని తెలిసింది. అయినా శారదా మాత్రం తన భర్తను వదల్లేదని కోపంతో పీరాసాబ్ భార్య శారదా ఇంటికి వెళ్లి ఇటీవల పెద్ద గొడవ చేసింది. ఆ సమయంలో ఊరి పెద్దలు పంచాయితీలు చేసి పీరాసాబ్, శారదాలను హెచ్చరించారు.

love-affair

మీరు అక్రమ సంబంధం మానుకోవాలని, అనవరంగా రెండు కాపురాలు కూలిపోతాయని శారదా, పీరాసాబ్ కు బుద్దిమాటలు చెప్పారు. అక్రమ సంబంధం వదులుకోలేక, ఇద్దరూ కలిసి జీవించలేమని తెలుసుకున్న శారదా, పీరాసాబ్ మంగళవారం రాత్రి ఊరి బయటకు వెళ్లి ఇద్దరూ కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

బుధవారం ఉదయం ఇద్దరి శవాలు చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్రమ సంబంధం గురించి అదరికి తెలిసిపోయిందని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలుసుకుని పీరాసాబ్, శారదా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. రెండు ఫ్యామిలీల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+