నటి గౌహర్ ఖాన్‌ను ఎందుకు కొట్టాడంటే..? వీడియో హల్‌చల్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, మోడల్ గౌహర్ ఖాన్‌ను పది రోజుల క్రితం ఓ వ్యక్తి చెంప పైన కొట్టిన విషయం తెలిసిందే. ఇది సంచలనం అయింది. తాజాగా గౌహర్ ఖాన్‌ను చెంప పైన ఆ వ్యక్తి ఎందుకు చెంప పైన కొట్టాడో చెబుతూ ఓ యువకుడు సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇది ఇంటర్నెట్లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దీనిని రెండు రోజుల క్రితం అతను అప్ లోడ్ చేశాడు. దానిని రెండు లక్షల మందికి పైగా ఇప్పటి వరకు చూశారు. ఇందులో గౌహర్ ఖాన్‌ను సదరు వ్యక్తి అకిల్ మాలిక్ ఎందుకు కొట్టాలనుకున్నాడో.. ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాడు.
బహుశా, అతను (అకిల్ మాలిక్, గౌహర్ ఖాన్‌ను కొట్టిన వ్యక్తి) తాను మహిళను కొడితే.. తనను ఎవరు ఏం చేయలేరని అనుకున్నాడేమోనని అభిప్రాయపడ్డాడు. భార్య కొడుతుందా అంటే.. తానే ఆమెను నిత్యం కొడతానని భావించి ఉంటాడని అందులో పేర్కొన్నారు. అయితే, దేశంలో మహిళలను, భార్యలను కొట్టేవారు ఉన్నారని అతని అభిప్రాయంగా కనిపిస్తోంది.

కాగా, ఓ యువకుడు బాలీవుడ్ నటి చెంప చెళ్లుమనిపించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హాట్ గర్ల్ గౌహర్ ఖాన్ పైన చేయి చేసుకున్నాడు. నా పేరే కాంచనమాల.. నా వయసే గరం మసాలా.. అంటూ శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఆడిపాడిన హాట్ గర్ల్ గౌహర్ ఖాన్.
పొట్టి దుస్తులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తించే ఆమెకు ఒక చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక ముస్లింవై ఉండీ ఇలాంటి దుస్తులు వేసుకుంటావా అంటూ నటి, మోడల్ గౌహర్ ఖాన్ చెంప ఛెళ్లుమనిపించాడు ఓ యువకుడు. అక్కడితో ఆగకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి పేరు మాలిక్ అకిల్. వయస్సు 24 ఏళ్లు.
గోరేగావ్ శివార్లలోని ఫిలిం సిటీలో ఇండియాస్ రా స్టార్ అనే రియాలిటీ షోను నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆయన మూడు రోజులుగా ఈ షోకు హాజరయ్యాడు. అనంతరం ఆదివారం నాడు ప్రేక్షకుల్లోని అకిల్ ఈ దాడికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications