Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

liplock: లిప్ లాక్ అత్యాచారం చేయాలనుకున్నాడు,రెండు ముక్కలుగా కొరికేసిన యువతి, కిందపడింది !

యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె కేకలు వేసింది. యువతి కేకలు వెయ్యకుండా లిప్ లాక్ చేశాడు. కోపం తట్టుకోలేక ఆమెయువకుడికి ఏం కోరకాలో అది కోరికేయడంతో నొప్పి తట్టుకోలేక ఆ కామాంధుడు ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేలా

లక్నో/ఉత్తరప్రదేశ్: ఓ యువతి మీద ఓ యువకుడు కన్ను వేశాడు. ఎలాగైనా యువతిని లొంగదీసుకోవాలని అతను అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే యువతి మాత్రం ఆ కేటుగాడి హీరో ఫోజులకు లొంగలేదు. యువతిని ఎలాగైనా అనుభవించాలని ఆ యువకుడు చాలాకాలం నుంచి వేచి చూస్తున్నాడు. యువతి ఒంటరిగా ఉందని గుర్తించి అక్కడికి వెళ్లి ఆమెను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. తరువాత యువతితో లిప్ లాక్ చేశాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె కేకలు వేసింది. యువతి కేకలు వెయ్యకుండా మళ్లీ లిప్ లాక్ చేశాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె కోపం తట్టుకోలేక యువకుడికి ఏం కోరకాలో అది కోరికేయడంతో నొప్పి తట్టుకోలేక తరువాత ఆ కామాంధుడు ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేలా కేకలు వేశాడు.

యువతితో లిప్ లాక్

యువతితో లిప్ లాక్

తనపై అత్యాచారానికి ప్రయత్నించి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి మీద ఓ యువతి ధైర్యంగా పోరాటం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ యువతి ధైర్యం చేసి కామాంధుడి చేతిలో అత్యాచారం జరగకుండా తప్పించుకుంది. పొలంలో పని చేస్తున్న యువతిని పట్టుకుని అత్యాచారం చేసేందుకు వెళ్లిన వ్యక్తి ఆమెను బలవంతంగా లిప్ లాక్ చేసి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. యువతి మీద అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. పదేపదే లిప్ లాక్ తో ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు.

పెదవి రెండు ముక్కలు..... కిందపడిపోయింది

పెదవి రెండు ముక్కలు..... కిందపడిపోయింది

కామాంధుడి నుంచి తప్పించుకోవడానికి ఆ యువతి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే బలంగా ఉన్న యువకుడు ఆమెను మాత్రం వదల్లేదు. యువతి కేకలు వెయ్యకుండా ఆమెను నోటిని అతని నోటితో లాక్ చేశాడు. యువతికి ఎక్కడో మండిపోయి కామాంధుడి కిందపెదవిని ఆమె తన పళ్ళతో చాలా గట్టిగా కొరికింది. దీంతో యువకుడి పెదవి కింది భాగం పూర్తిగా తెగిపోయి పెదవి కిందపడిపోయింది. కామాంధుడి నోరు మొత్తం రక్తసిక్తమైంది. యువతి, యువకుడి అరుపులు విన్న సమీపంలోని పొలంలో పని చేస్తున్న వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు.

పెదవిని కవర్ లో ప్యాక్ చేసుకుని వెళ్లిన పోలీసులు

పెదవిని కవర్ లో ప్యాక్ చేసుకుని వెళ్లిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా దారవుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కామాంధుడు మోహిత్ సైనీ పెదవి ముక్క కిందపడిపోవడంతో దానిని ప్లాస్టిక్ ప్యాకెట్‌లో వేసుకుని సీల్ చేసిన పోలీసులు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. యువతి కోరికోయడంతో తీవ్రంగా గాయపడిన మోహిత్ సైనీని సీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించామని పోలీసులు అన్నారు. నిందితుడు లావాడ్ గ్రామానికి చెందిన మోహిత్ సైనీపై అత్యాచారం, లైంగిక వేధింపుల తదితర ఆరోపణలపై మహిళ ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

టైమ్ చూసి వెంటపడ్డాడు

టైమ్ చూసి వెంటపడ్డాడు

బాధితురాలు జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పింది. మద్యాహ్నం తన పొలంలో పని చెయ్యడానికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. జనం కూడా పెద్దగా లేరు, ఇంతలో వెనుక నుంచి వచ్చిన మోహిత్ సైనీ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడని, ఆ సమయంలో తాను చాలా ఆందోళన చెందానని, మొదట్లో నన్ను ఎవరు పట్టుకున్నారో తెలియక భయంతో కేకలు వేశానని యువతి పోలీసులకు చెప్పింది, తాను అరవడంతో మోహిత్ తాను కేకలు వెయ్యకుండా నా మెడ పట్టుకున్నాడని, సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి నా బట్టలు చింపి తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడని యువతి పోలీసులకు చెప్పింది.

నన్ను నేను రక్షించుకోవాలని ?

నన్ను నేను రక్షించుకోవాలని ?

మోహిత్ నుంచి తప్పించుకోవాలని తాను అనేక ప్రయత్నాలు చేశానని యువతి పోలీసులకు తెలిపింది. అకస్మాత్తుగా మోహిత్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు, తాను కేకలు వెయ్యకుండా పదేపదే లిప్ లాక్ చేశాడు. కోపం, భయంతో నన్ను నేను రక్షించుకోవడానికి నా పళ్ళ సహాయంతో అతని పెదవిని చాలా గట్టిగా కొరికేశానని, అతని పెదవి నేలమీద పడేంత వరకు గట్టిగా కొరుకుతూనే ఉన్నానని యువతి పోలీసులకు చెప్పింది. మోహిత్ పెదవి నేలపై పడటంతో నొప్పి తట్టుకోలేక అతను అరవడం మొదలుపెట్టాడని, తాను కూడా మరింత గట్టిగా అరవడం మొదలుపెట్టానని, ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లు వచ్చి నన్ను రక్షించారని ఆ యువతి పోలీసులకు జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది.

పోలీసులు ఏం చెప్పారంటే

పోలీసులు ఏం చెప్పారంటే

మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు మోహిత్ సైనీపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ దౌరాల సంజయ్ కుమార్ శర్మ స్థానిక మీడియాకు చెప్పారు. యువకుడి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు. విచారణలో నిందితుడు తన పేరు మోహిత్ సైనీ అని, లావాడాలోని మొహల్లా సైయాన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని వెల్లడించాడని పోలీసులు అన్నారు. అయితే యువకుడు, యువతి వేర్వేరు గ్రామాల్లో ఉంటున్నారని, మోహిత్ యువతి ఉంటున్న గ్రామానికి ఎందుకు వచ్చాడు? బాధితురాలి గురించి ముందే అతనికి పక్కా సమాచారం తెలుసా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+