కాలేజ్ అమ్మాయి వెంట తిరుగుతున్నాడని ప్రియుడి, వాడి ఫ్రెండ్స్ ఏం చేశారంటే ?
బెంగళూరు: కాలేజ్ లో చదువుతున్న ఓ అమ్మాయిని ఓ యువకుడు ప్రేమిస్తున్నాడు. నేరచరిత్ర ఉన్న కాలేజ్ డ్రాపౌట్ యువకుడు ఆమ్మాయి వెంట తిరుగుతున్నాడు. అయితే కాలేజ్ లో బీకామ్ చదువుతున్న ఓ యువకుడు అదే అమ్మాయి వెంట తిరుగుతూ తనను ప్రేమించాలని చెబుతున్నాడని తెలిసింది. ఈ మ్యాటర్ అమ్మాయి ప్రియుడికి తెలిసింది. అసలే కన్నింగ్ అయిన ప్రియుడు కాలేజ్ అబ్బాయిని మాట్లాడాలని పిలిపించాడు. త్రికోణ ప్రేమకథలో ఓ యువకుడి ప్రాణం పోయింది.
బెంగళూరు నగరంలోని బాణసవాడిలో కార్తీక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కార్తీక్ కు నేర చరిత్ర ఉంది. బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లోని రౌడీషీటర్ల జాబితాలో కార్తీక్ పేరు ఉంది. కాలేజ్ లో చదువుతున్న ఓ అమ్మాయిని కార్తీక్ ప్రేమించాడని తెలిసింది. కార్తీక్ దెబ్బకు ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించిందని తెలిసింది.

స్నేహితులు అభిషేక్, డ్యానియల్, శ్రీకాంత్, నెల్సన్, రాఖి అనే ఐదు మందిని కలిసిక కార్తీక్ తన ప్రియురాలు వెంట తిరుగుతున్న మార్వేష్ ను చంపేయాలని చెప్పాడు. ప్రియురాలు చదువుతున్న కాలేజ్ ముందు మార్వేష్ టీ తాగుతూ ఆమె బయటకు వస్తే మాట్లాడాలని నిలబడి ఉన్నాడు. ఆ సందర్బంలో అక్కడికి వెళ్లిన రాఖి, డ్యానియల్ టీ తాగుతున్న మార్వేష్ ను నీతో మాట్లాడాలని చెప్పి అతన్ని బలవంతంగా అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు.
తరువాత కార్తీక్ అతని స్నేహితులు కలిసి మార్వేష్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేశారు. మార్వేష్ ప్రమాదంలో చనిపోయాడని చిత్రీకరించిన కార్తీక్ అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన బాణసవాడి పోలీసులు మ్యాటర్ బయటకు లాగారు. రామమూర్తి నగర పోలీసుల సహాయంతో మార్వేష్ హత్య కేసులో ప్రియుడు కార్తీక్ తో పాటు అతని స్నేహితులు ఐదు మందిని అరెస్టు చేశారు. కాలేజ్ లో చదుతున్న అమ్మాయి కోసం జరిగిన గొడవలో మార్వేష్ ప్రాణం పోయిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications