అడవిలో యువతిని ఏం చేశాడంటే ?, ఫోన్ చేసి పిలిపించి, ఇలాంటి శాడిస్టు ఉంటాడా ?
అనుమానాస్పదంగా అదృశ్యమైన యువతి శవమై కనిపించిన కేసును కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని అగుంబే పోలీసులు చేదించారు. యువతిని హత్య చేసింది తానే అని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతిని నమ్మించి ఆమెను పక్కాప్లాన్ తో హత్య చేసిన నిందితుడికి హత్య చేసిన ఫీలింగ్ ఏమాత్రం లేదని పోలీసు అధికారులు అంటున్నారు
కుశాల్ అనే వ్యక్తి కుమార్తె పూజా(24) జూన్ 30వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. కూతురు పూజా రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కుశాల్ తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం వెతికారు. బంధువులు ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో వెతికినా పూజా ఆచూకి తెలీలేదు. పూజ స్నేహితులు అందరికి ఫోన్లు చేసి ఆమె గురించి అడిగినా ఎలాంటి ఫలితం లేదు.

పూజా అదృశ్యంపై అగుంబే పోలీస్ స్టేషన్‌లో ఆమె తండ్రి కుశాల్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైంది. అగుంబే పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రంగనాథ్ అంతరగట్టి ఆధ్వర్యంలో పోలీసులు బృందంగా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు. పూజా కోసం పలు ప్రాంతాల్లో గాలించినా పోలీసులకు ఎలాంటి క్లూ చిక్కలేదు. పూజా మొబైల్ ఫోన్ నెంబర్ లోని ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ వివరాలను పోలీసులు సేకరించారు.
ఇదే సమయంలో అటవి ప్రాంతంలోని ఓ నీటి గుంత సమీపంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. శవమై కనిపించిన యువతిని పూజా గుర్తించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. పూజాకు తెలిసిన మణి అనే వ్యక్తి ఆమెను చితకబాది చంపేసి నాలూరు సమీపంలోని గోతిలో పడేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తరువాత పోలీసులు మణిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు బెండ్ తియ్యడంతో నిందితుడు మణి పోలీసుల ముందు తానే పూజాను హత్య చేశానని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు శవపరీక్ష నిర్వహించి పూజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు మణిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.
పూజా హత్యకు గురైన ప్రదేశాన్ని మాజీ హోం మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆరగ జ్ఞానేంద్ర సందర్శించి వివరాలు సేకరించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆరగ జ్ఞానేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు అధికారులతో మాట్లాడి పూజా హత్య గురించి సమాచారం తెలుసుకున్నారు. అయితే పూజాను ఎందుకు హత్య చేశాను అని మణి బయటకు చెప్పడం లేదని, కేసు విచారణలో ఉందని శివమొగ్గ జిల్లా పోలీసులు తెలిపారు.
-
Bengaluru: ఉలిక్కిపడ్డ గార్డెన్ సిటీ..డెడ్ బాడీతో పోలీసులకు సరెండర్..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications