Bengaluru: రేయ్ ఇది బెంగళూరు, కారులో సిగరేట్ తాగుతావా ?, 95 వేలు, నగలు, సీసీవీల్లో ?
బెంగళూరు/కొచ్చి: మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు విలాసవంతమైన కారులో వెలుతున్నాడు. మార్గం మధ్యలో అతను కారులోనే సిగరేట్ తాగుతున్నాడు. బైక్ ల్లో వెళ్లిన నలుగురు రేయ్ నువ్వు పబ్లిక్ గా సిగరేట్ తాగుతావా అంటూ అతని కారును వెంబడించి మార్గం మధ్యలో అడ్డగించారు. పబ్లిక్ గా సిగరేట్ తాగుతున్నావని పోలీసులకు చెప్పి నిన్ను జైలుకు పంపిస్తామని ఆ యువకుడిని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి 95 వేల నగదు, 30 గ్రాముల బంగారం లాక్కెళ్లారు. ఐటీ హబ్ లోబహుళజాతి బ్యాంకింగ్ రంగానికి చెందిన ఆర్థిక సేవల కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న క్రెడిట్ అసెస్‌మెంట్ ఆఫీసర్ దారి దోపిడీకి గురి కావడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

ఇది మ్యాటర్
బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని నాగవార పాళ్యలో ధనంజయ్ నాయర్ నివాసం ఉంటున్నాడు. ఇటీవల ధనంజయ్ నాయర్ అతని కారులో ఆఫీసుకు వెళ్తున్నాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాయర్ అతని కారు లోపల సిగరెట్ తాగుతూ వెలుతున్నాడు. కొందరు బైక్ ల్లో వెలుతున్న నిందితులు నాయర్ సిగరేట్ తాగడం గమనించారు. కారును వెంబడించి బెన్నిగనహళ్లి అండర్‌పాస్ వద్ద రెండు వైపుల స్కూటర్‌లతో నాయర్ కారును చుట్టుముట్టి అడ్డగించారు.

రేయ్ నిన్ను జైలుకు పంపిస్తాము
కారు డ్రైవింగ్ చేస్తూ కారులోనే సిగరేట్ తాగినందుకు నన్నిు పోలీసులకు పట్టించి అరెస్టు చేయిస్తామని, కచ్చితంగా జైలుకు పంపిస్తామని నాయర్ ను బెదిరించారు. నాయర్ కారు డోర్‌ను బలవంతంగా తెరిచిన నిందితులు అదే కారులో ముగ్గురు ఎక్కారు. దుండగులు కొన్ని గుర్తింపు కార్డులు చూపించి పోలీసు అధికారులు తమకు తెలుసునని నాయర్ ను బెదిరించారు. మా వద్ద ఆయుధాలు ఉన్నాయని, నిన్ను కారులోనే ఏదో ఒకటి చేస్తామని బెదిరించారు. నాయర్ కు కన్నడ బాష రాకపోవడంతో నిందితులు ఇంకా రెచ్చిపోచారని తెలిసింది.

ఏటీఎం దగ్గరకు వెళ్లి ?
నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్లాలంటే మేము చెప్పినట్లు వినాలని నిందితులు నాయర్ ను బెదిరించారు. తరువాత నిందితులు నాయర్ మొబైల్ ఫోన్, వాలెట్ లాక్కొన్నారు. సమీపంలోని ఏటీఎం కేంద్రం దగ్గర కారు అపమని చెప్పిన నిందితులు నువ్వు వెళ్లి లక్ష రూపాయలు నగదు డ్రా చేసుకుని రావాలని నాయర్ కు చెప్పి వాళ్లు కారులోనే కుర్చున్నారు. ఏటీఎంలోకి వెళ్లిన నాయర్ అతని క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 50,000 డెబిట్ కార్డ్ ఉపయోగించి రూ. 45,000. మొత్తం రూ.95 వేలు డ్రా చేసుకుని వచ్చాడు. నాయర్ కారులో కుర్చున్న తరువాత అతన్ని మళ్లీ బెదిరించి అతని మెడలో ఉన్న సుమారు 30 గ్రాముల రెండు బంగారు గొలుసులను లాక్కొని కొద్ది దూరం వెళ్లారు.

ఫ్రెండ్స్ చెప్పి లబోదిబో అన్న నాయర్
కొద్ది దూరం వెళ్లిన తరువాత నిందితులు ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను, నీ కుటుంబానికి కూడా చంపేస్తాని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన గురించి నాయర్ తన కంపెనీలో పని చేసే స్నేహితులకు చెప్పి విచారం వ్యక్తం చేశాడు. సిగరేట్ తాగిన పాపానికి లక్ష రూపాయల డబ్బుతో పాటు రూ. 1.50 లక్షల నగలు పోయాయని లబోదిబో అన్నాడు.

సీసీటీవీల్లో చిక్కకుండా ప్లాన్ చేసిన నిందితులు
పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని నాయర్ కు అతని ఫ్రెండ్స్ ఒత్తిడి చెయ్యడంతో బాధితుడు రామమూర్తినగర్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అండర్ పాస్ దగ్గర, ఏటీఎంకు మధ్య ఉన్న గ్యాప్‌లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించినా అందులో నిందితుల ఆచూకిలేదని పోలీసులు అంటున్నారు. నిందితులను గుర్తించి వారిని కచ్చితంగా పట్టుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications