ఎంపీ కొడుకు నన్ను ఏం చేశాడంటే ?, బెంగళూరు, మైసూరు హోటల్ లో ?, ఢిల్లీకి షాక్ ఇచ్చిన లేడీ !

బెంగళూరు/బళ్లారి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసి చంపేస్తానని బెదిరించాడని కర్ణాటకలోని బళ్లారికి చెందిన బీజేపీ ఎంపీ దేవేంద్రప్ప కుమారుడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మైసూరు మహారాజా కళాశాల అధ్యాపకుడు, బీజేపీ ఎంపీ కుమారుడైన వై.డి.రంగనాథ్‌ అలియాస్ రంగనాథ్ (42)పై బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్‌ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. చేసింది. బెంగళూరు నగరానికి చెందిన 24 ఏళ్ల యువతి ఎంపీ కుమారుడి మీద కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కుమారుడు రంగనాథ్‌కు నోటీసులిచ్చామని, విచారణ ప్రారంభించామని పోలీసు అధికారులు తెలిపారు. 2022లో స్నేహితుల ద్వారా రంగనాథ్ తనకు పరిచయం అయ్యాడని ఆ యువతి అంటోంది. ఆ తర్వాత తరచూ తనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని ఆ యువతి చెప్పింది. కొంతకాలం తరువాత నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మైసూర్‌లోని పీయూ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నానని రంగనాథ్ తనకు చెప్పాడని ఆ యువతి పోలీసులకు చెప్పింది.

A young woman filed a case in Bengaluru that the son of BJP MP Devendrappa of Bellary had cheated her.
కేజీఎఫ్ హీరో యష్ అసలు పేరు, ఆస్తుల విలువ, సంపాధన ఎంత ?, రాత్రికి రాత్రి సుడితిరిగింది !

తాను చాలా మంచి జీతం తీసుకుంటునన్నానని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను బాగా చూసుకుంటావని ఎంపీ కుమారుడు రంగనాథ్ చెప్పాడని, తాను అతని మాటలు నమ్మానని, ఆ తర్వాత హోటల్‌కి తీసుకెళ్లి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తానని రంగనాథ్ తనను బెదిరించాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగనాథ్ ఇదే ఏడాది జనవరి 23వ తేదీన నాకు ఫోన్ చేసి, తాను పని నిమిత్తం బెంగళూరు వస్తున్నానని చెప్పాడు. జనవరి 24న బెంగళూరులో కొడిగేహళ్లిలోని స్వాతి హోటల్‌కు వచ్చి నన్ను అక్కడికి పిలిచాడు. అనంతరం మైసూరులోని లలిత్ మహల్ హోటల్‌కు తీసుకెళ్లాడని, నిన్ను ఇప్పుడు నా ఇంటికి తీసుకెళ్లలేనని, ఈరోజు హోటల్‌లో పడుకుని ఉదయం మా ఇంటికి వెలుదామని రంగనాథ్ తనకు చెప్పాడని యువతి పోలీసులకు చెప్పింది.

ఆరోజు రాత్రి నేను హోటల్‌లో ఉండగా రంగనాథ్‌ మద్యం సేవించి వచ్చాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో శారీరక సంబంధం పెంచుకున్నాడని, మరుసటి రోజు నన్ను బెంగుళూరు పంపించాడని. ఇంతకాలం రంగనాథ్ నాతో మునుపటిలా మాట్లాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే తనను చంపేస్తామని ఎంపీ దేవేంద్రప్ప కుమారుడు రంగనాథ్ తనను బెదిరించాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

A young woman filed a case in Bengaluru that the son of BJP MP Devendrappa of Bellary had cheated her.

తన జీవితం నాశనం చేసిన రంగనాథ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో కోరింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. లెక్చరర్ వైడీ రంగనాథ్‌పై బాధితురాలు నవంబర్ 6వ తేదీన బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదులో నిందితుడి చిరునామాతో సహా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, రెండు రోజుల తర్వాత నిందితుడి ఆధార్ కార్డు వివరాలను ఇచ్చారని, నిందితుడు రంగనాథ్ ఇంటి చిరునామా, ఈ-మెయిల్ కు నవంబర్ 8వ తేదీన నోటీసు పంపారు. ఆరోపణలకు తగిన ఆధారాలు, సాక్షాలు ఇవ్వాలని రంగనాథ్ మీద కేసు పెట్టిన బాధితురాలికి నోటీసులు కూడా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ రంగనాథ్‌కు ఇంతకు ముందు వివాహమైన విషయం తనకు తెలీదని, ఒక నెల తర్వాత సందేహం వచ్చిందని, తరువాత కూడా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను శారీరకంగా వాడుకున్నాడని, దీని గురించి నేను అతనిని ప్రశ్నించానని, రంగనాథ్ కులం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, తాను డబ్బు డిమాండ్ చెయ్యలేదని, తనను భార్యగా స్వీకరించాలని బాధితురాలు అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+