కేజీఎఫ్ హీరో యష్ అసలు పేరు, ఆస్తుల విలువ, సంపాధన ఎంత ?, రాత్రికి రాత్రి సుడితిరిగింది !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ కు కొన్ని ఏళ్ల క్రితమే మంచిరోజులు మొదలైనాయి. వరుస హిట్ సినిమాలతో స్యాండిల్ వుడ్ చిత్రపరిశ్రమ మంచి జోష్ మీద ఉంది. కేజీఎఫ్ సినిమాతో దేశం మొత్తాన్ని తమవైపు తిప్పుకున్న స్యాండిల్ వుడ్ తరువాత కాంతార సినిమాతో మరోసారి దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2తో ఆ సినిమా హీరో యష్ రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయాడు.
కేజీఎఫ్ సినిమాకు ముందు రామాచారి సినిమాతో మంచి క్రేజ్ సంపాధించుకున్న యష్ తరువాత కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో పాన్ ఇండియా లెవల్లో విడుదల కావడంతో రాత్రికిరాత్రి టాప్ హీరోల్లో ఒక్కడు అయిపోయాడు. కేజీఎఫ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా హీరో యష్ కోట్లాదిరూపాయల ఆస్తులు సంపాధించాడు. సినిమాలతో పాటు పలు సంస్థల యాడ్స్ లో నటిస్తున్నాడు. అంతేకాకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన యష్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి.

1986 జనవరి 8వ తేదీన జన్మించిన యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ అలియాస్ నవీన్ గౌడ అలియాస్ నవీన్. మైసూరులో సాధారణ యువకుడిగా పెరిగిన నవీన్ కుమార్ గౌడ తరువాత స్యాండిల్ వుడ్ లో అడుగుపెట్టి అతని పేరును యష్ గా మార్చుకున్నారు. మొదటి స్యాండిల్ వుడ్ లో చిన్నహీరోగా పేరు సంపాధించుకన్న యష్ రానురాను లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి (రామాచారి) సినిమాతో మంచి పేరు సంపాధించుకుని స్యాండిల్ వుడ్ చిత్రపరిశ్రమలో పాతుకుపోయాడు. ఇక కేజీఎఫ్ సినిమాతో యష్ స్టార్ పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా కేజీఎఫ్ సినిమా హవాతో యష్ కు మంచిడిమాండ్ వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో నటించిన యష్ రూ 25 కోట్లు పారితోషికం తీసుకున్నాడని స్యాండిల్ వుడ్ ప్రముఖులు అంటున్నారు.
యష్ ప్రస్తుతం ఒక్క సినిమాలో నటిస్తే దాదాపు రూ 20 కోట్లకు పైగా ఆయనకు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారని తెలిసింది. యష్ ప్రస్తుతం సంపాధించిన నికర ఆస్తి విలువ సుమారు 7 మిలియన్ డాలర్లు అని తెలిసింది. భారత కరెన్సీ ప్రకారం యష్ రూ 53 కోట్ల వరకు సంపాధించాడని అంచనా వేశారు. సినిమాలతో పాటు పలు సంస్థలు, కంపెనీల యాడ్స్, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న యష్ భారీ మొత్తంలో డబ్బు సంపాధించడంతో పాటు విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడని కన్నడ మీడియా అంటోంది.

హీరో యష్ సంవత్సరానికి 12 కోట్ల వరకు సంపాధిస్తున్నారని, సినిమాలో హీరోగా నటిస్తున్న యష్ పారితోషికంతో పాటు ఆ సినిమా లాభాల్లో షేర్ కూడా తీసుకుంటున్నాడని వెలుగు చూసింది. సినిమాలో డబ్బు బాగా సంపాధిస్తున్న యష్ సమాజసేవ కూడా చేస్తున్నాడని, సంపాధిస్తున్న డబ్బులకు సక్రమంగా యష్ ఆదాయపన్ను కడుతున్నాడని, దేశంలో ఎక్కువ ఆదాయం సంపాధిస్తున్న వారితో పాటు యష్ క్రమం తప్పకుండా ఆదాయపన్ను చెల్లిస్తున్నాడని తెలిసింది.
బెంగళూరులో యష్ కు ఓ కార్యాలయం ఉంది. బెంగళూరులో సొంత ఇల్లు కట్టుకున్న యష్ రియాల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడని వెలుగు చూసింది. డబ్బు బాగా సంపాదిస్తున్న యష్ విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. మొత్తం మీద స్యాండిల్ వుడ్ లో భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న యష్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. హీరో యష్ కు ఇప్పుడు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.












Click it and Unblock the Notifications