అక్కను చంపేసి అంత్యక్రియల సమయంలో శవం ముందు డ్యాన్స్ చేసిన చెల్లెలు !

చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత మరో వ్యక్తి, అతనికి విడాకులు ఇచ్చిన తరువాత మరో ఇద్దరు మగాళ్లను పెళ్లి చేసుకుంది. ఇదే సమయంలో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంత మందితో తిరిగిన మహిళ రైల్వేస్టేషన్ లో హత్యకు గురైయ్యింది.

ఈ మహిళ హత్య కేసులో ఎవ్వరూ ఊహించిన విదంగా హత్యకు గురైన మహిళ చెల్లెలు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. చెన్నైలోని మీనంబాక్కంలోని ఎంజీఆర్ నగర్‌ లో నివాసం ఉండే రాజేశ్వరి. ఎలక్ట్రిక్ రైళ్లలో సమోసాలు, పండ్లు అమ్మేది. ఈనెల19వ తేదీ రాత్రి సైదాపేట రైల్వేస్టేషన్‌లో రాజేశ్వరిని పొడిచేశారు. తీవ్రగాయాలైన రాజేశ్వరి చనిపోయింది.

deadbody21

ఎగ్మూరు రైల్వే పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పాటు అయ్యి రాజేశ్వరి హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే రాజేశ్వరి నలుగురిని పెళ్లి చేసుకోవడం, మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండటంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా తయారైంది. రాజేశ్వరి పెళ్లి చేసుకున్న వారిలో ఓ భర్త ఇప్పటికే చనిపోవడంతో మిగిలిన వారిని పోలీసులు విచారణ చేశారు.

రాజేశ్వరి అంత్యక్రియలు జరిగిన సమయంలో తీసిన ఓ వీడియో పోలీసులకు చిక్కడంతో కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. రాజేశ్వరి శవం ముందు ఆమె సోదరి నాగవల్లి పిచ్చపాటిగా డ్యాన్స్ వేస్తున్న వీడియో పోలీసులకు చిక్కింది. పోలీసులు రాజేశ్వరి ప్రియుడు శక్తివేల్ ను విచారణ చేస్తున్న మ్యాటర్ బయటకు వచ్చింది.

deadbody3

నలుగురిని పెళ్లి చేసుకున్న అక్క తరువాత శక్తివేల్ తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న నాగవల్లి ఆమె అక్కను మందలించిందని తెలిసింది. ఇదే సమయంలో తన అక్క రాజేశ్వరితో నువ్వు తిరగకూడదని శక్తివేల్ కు కూడా నాగవల్లి వార్నింగ్ ఇచ్చిందని తెలిసింది. అయితే రాజేశ్వరి పద్దతి మార్చుకోకపోవడంతో ఆమె సోదరి నాగవల్లి రగిలిపోయింది.

ఈనెల 19వ తేదీన రైల్వేస్టేషన్ లో అక్క రాజేశ్వరిని ఆమె బంధువు జగదీషన్ తో కలిసి హత్య చేసిందని, తరువాత అక్క శవం ముందు పడి బోరున విలపించిందని పోలీసులు అన్నారు. అక్క రాజేశ్వరి అంత్యక్రియల సందర్బంగా మద్యం సేవించిన నాగవల్లి శవం ముందు పిచ్చపాటిగా డ్యాన్స్ చేసిందని పోలీసులు గుర్తించారు. రాజేశ్వరి హత్య కేసులో ఆమె సోదరని నాగవల్లి, బంధువు జగదీషన్ తో పాటు మొత్తం ఐదు మందిని అరెస్టు చేశామని చెన్నై పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+