కేంద్ర మంత్రి కొడుకు ఇంట్లో యువకుడి దారుణ హత్య, ఆ టైమ్ లో ఏం జరిగింది ?
లక్నో: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడి ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున 30 ఏళ్ల వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. హత్యకు గురైన వ్యక్తి వినయ్ శ్రీవాస్తవ్ (30) అని జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) ఆకాష్ కుల్హారీ పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్ర బీజేపీ మంత్రి కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్ నివాసంలో శ్రీవాస్తవ తుపాకీ తుటాల దెబ్బకు మరణించాడని పోలీసులు అన్నారు.
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీగా గెలిచిన కౌశల్ కిషోర్ శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం దర్యాప్తులో ఉందని, వివరాలు తెలుసుకుని మాట్లాడుతానని అన్నారు.

శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని, ప్రస్తుతం కేంద్ర మంత్రి కుమారుడు ఢిల్లీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. బాధితుడి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినయ్ శ్రీవాస్తవ్ రాత్రి వికాస్ కిషోర్ ఇంటికి వెళ్లాడు. అజయ్ రావత్, అంకిత్ వర్మ, షమీమ్, బాబా కేంద్ర మంత్రి కుమారుడి ఇంట్లో ఉన్నారని చెప్పారు.
అందరూ నా సోదరుడు వినయ్ కలిసి భోజనం చేశారని, ఏదో విషయంలో వారి మధ్య గొడవ జరిగిందని. ఇంతలో నా సోదరుడు వినయ్ ని తుపాకీతో కాల్చి చంపేశారని బాదితుడి సోదరుడు ఆరోపించాడు. నాకు మా అన్న చావు మీద అనుమానం ఉందని, అతన్ని కాల్చి చంపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వినయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications