Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దటీజ్ నిర్మలా సీతారామన్!: రక్షణ లేకుండా.. వీధిలో నడుచుకుంటూ... రెస్టారెంట్లో భోజనం చేసి...

Recommended Video

    Nirmala Sitharaman Walked To a Bengaluru Restaurant : video viral

    బెంగళూరు: మన దేశంలో మంత్రులు ఎక్కడికైనా వెళ్తే వారి చుట్టూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉండటం సహజం. ఇక వారు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు.

    Aam Aadmi Lunch? When Nirmala Sitharaman Walked to a Bengaluru Restaurant for a Meal

    వారి రాకపోకల కారణంగా సామాన్యులు ఎంత ఇబ్బంది పడినా సరే.. ఆ బుగ్గకారు, బందోబస్తు భోగాలను వదులుకోవడానికి అమాత్యులు ఎంతమాత్రం ఇష్టపడరు. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మాత్రం ఇందుకు మినహాయింపుగానే చెప్పుకోవాలి.

    కేంద్రమంత్రి.. అదీ అత్యంత కీలకమైన రక్షణ మంత్రి పదవిలో ఉన్న నిర్మలా సీతారామన్‌ ఏ హంగూ, ఆర్భాటం లేకుండా సామాన్య వ్యక్తిలా వీధిలో నడిచి అందర్ని ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన ఇటీవల బెంగళూరులో చోటుచేసుకుంది.

    బెంగళూరులో పర్యటించిన నిర్మలా సీతారామన్‌ ఓ సమావేశం ముగించుకొని మధ్యాహ్నం సమయంలో ఎస్పీ ఆఫీసు నుంచి నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న హోటల్‌లో భోజనం చేశారు.

    ఆ సమయంలో ఆమె వెంట కొంతమంది అధికారులు, సామాన్యులు తప్ప ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. నిర్మలా సీతారామన్‌ నిరాడంబర వ్యక్తిత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+